India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home ఆధ్యాత్మికం

Varalakshmi Vratham 2021 : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఎందుకు చేస్తారో తెలుసా ? వ్ర‌తం ఎలా చేయాలి ? పూర్తి విధానం, దాంతో క‌లిగే లాభాల‌ను తెలుసుకోండి..!

IDL Desk by IDL Desk
Thursday, 12 August 2021, 7:59 PM
in ఆధ్యాత్మికం, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

Varalakshmi Vratham 2021 : శ్రావ‌ణ మాసంలో మ‌హిళ‌లు స‌హ‌జంగానే శుక్ర‌వారం రోజు వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం చేస్తారు. ల‌క్ష్మీదేవికి పూజ‌లు చేస్తారు. శ్రావ‌ణ మాసంలో పౌర్ణ‌మికి ముందు వ‌చ్చే శుక్ర‌వారం రోజున వ్ర‌తం చేస్తారు.

Varalakshmi Vratham 2021 : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఎందుకు చేస్తారో తెలుసా ? వ్ర‌తం ఎలా చేయాలి ? పూర్తి విధానం, దాంతో క‌లిగే లాభాల‌ను తెలుసుకోండి..!

శ్రావణ మాసంలో మంగళవారం శ్రావణ గౌరీ వ్రతం చేస్తారు. శుక్రవారం మహాలక్ష్మీ పూజ చేస్తారు. ఈ వ్ర‌తం, పూజ‌లు చేస్తే స‌క‌ల కార్యాలు నెర‌వేరుతాయ‌ని న‌మ్ముతారు. అమోఘ‌మైన ఫలితాలు వ‌స్తాయ‌ని విశ్వ‌సిస్తారు. ధ‌నం, సంతానం, సర్వమంగళ సంప్రాప్తి, స‌క‌ల కార్యాలు నెర‌వేర‌డం కోసం, మ‌హిళ‌లు త‌మ ప‌సుపు కుంకుమ‌లు వ‌ర్థిల్లాల‌ని కోరుతూ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఎక్కువ‌గా చేస్తారు.

వరలక్ష్మీ వ్రతం చేసే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇంట్లోని పూజ‌ మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసి మండపంపై బియ్యపు పిండితో ముగ్గువేసి కలశం పెట్టాలి. త‌రువాత‌ అమ్మవారి ఫొటో ఏర్పాటు చేయాలి. పూజా సామగ్రి, తోరణాలు, పసుపు గణపతిని సిద్ధం చేయాలి.

Varalakshmi Vratham 2021 : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఎందుకు చేస్తారో తెలుసా ? వ్ర‌తం ఎలా చేయాలి ? పూర్తి విధానం, దాంతో క‌లిగే లాభాల‌ను తెలుసుకోండి..!

అమ్మ‌వారి పూజ కోసం పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధం, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, కంకణం కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపం కుందులు, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి దీపారాధనకు నెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు ఇలా సామ‌గ్రిని స‌మ‌కూర్చుకోవాలి.

తెల్లటి దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేదా తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. ఆ తోరాలను పీఠం వద్ద ఉంచి పూజకు సిద్ధం కావాలి.

Varalakshmi Vratham 2021 : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఎందుకు చేస్తారో తెలుసా ? వ్ర‌తం ఎలా చేయాలి ? పూర్తి విధానం, దాంతో క‌లిగే లాభాల‌ను తెలుసుకోండి..!

గణపతి పూజ

అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ

నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥

ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన

పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥

గణపతిపై అక్షతలు చల్లాలి.

యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.

ఓం సుముఖాయ నమః , ఓం ఏకదంతాయ నమః , ఓం కపిలాయ నమః ,ఓం గజకర్ణికాయ నమః ,ఓంలంబోదరాయ నమః

ఓం వికటాయ నమః,ఓం విఘ్నరాజాయ నమః,ఓం గణాధిపాయ నమః,ఓంధూమకేతవే నమః,ఓం వక్రతుండాయ నమః,

ఓం గణాధ్యక్షాయ నమః,ఓం ఫాలచంద్రాయ నమః,ఓం గజాననాయ నమః,ఓం శూర్పకర్ణాయ నమః,ఓం హేరంబాయ నమః,

ఓం స్కందపూర్వజాయనమః,ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి …ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.

స్వామివారి ముందు పళ్ళు గానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,

భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్!!

నీటిని నివేదన చుట్టూ జల్లుతూ .. సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి.. ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహాగుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని వదలాలి).

Varalakshmi Vratham 2021 : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఎందుకు చేస్తారో తెలుసా ? వ్ర‌తం ఎలా చేయాలి ? పూర్తి విధానం, దాంతో క‌లిగే లాభాల‌ను తెలుసుకోండి..!

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి) ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి! అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీత సుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!

వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.

కలశపూజ

కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ: స్థితాః కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా.. ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః..అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాః గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥

అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన పూజాద్రవ్యాలపైన పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.

అధాంగపూజ

పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.

చంచలాయై నమః – పాదౌ పూజయామి, చపలాయై నమః – జానునీ పూజయామి, పీతాంబరాయైనమః – ఉరుం పూజయామి, మలవాసిన్యైనమః – కటిం పూజయామి, పద్మాలయాయైనమః -నాభిం పూజయామి, మదనమాత్రేనమః – స్తనౌ పూజయామి, కంబుకంఠ్యై నమః- కంఠంపూజయామి, సుముఖాయైనమః – ముఖంపూజయామి, సునేత్రాయైనమః – నేత్రౌపూజయామి, రమాయైనమః – కర్ణౌ పూజయామి, కమలాయైనమః – శిరః పూజయామి, శ్రీవరలక్ష్య్మైనమః – సర్వాణ్యంగాని పూజయామి.

పుష్పాలు, పసుపు, కుంకుమతో అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి.

Varalakshmi Vratham 2021 : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఎందుకు చేస్తారో తెలుసా ? వ్ర‌తం ఎలా చేయాలి ? పూర్తి విధానం, దాంతో క‌లిగే లాభాల‌ను తెలుసుకోండి..!

శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి

ఓం ప్రకృత్యై నమః , ఓం వికృతై నమః , ఓం విద్యాయై నమః, ఓం సర్వభూత హితప్రదాయై నమః ,ఓం శ్రద్ధాయై నమః

ఓం విభూత్యై నమః , ఓం సురభ్యై నమః , ఓంపరమాత్మికాయై నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మాలయాయై నమః

ఓం శుచయే నమః , ఓంస్వాహాయై నమః , ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః ,ఓం ధన్యాయై నమః

ఓంహిరణ్మయై నమః , ఓం లక్ష్మ్యై నమః , ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యైనమః, ఓం ఆదిత్యై నమః

ఓం దిత్యై నమః , ఓం దీప్తాయై నమః, ఓం రమాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణై నమః

ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః , ఓంకామాక్ష్యై నమః, ఓం క్రోధ సంభవాయై నమః, ఓం అనుగ్రహ ప్రదాయై నమః , ఓంబుద్ధ్యె నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓంఅమృతాయై నమః

ఓం దీపాయై నమః , ఓం తుష్టయే నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓంలోకశోకవినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః

ఓం కరుణాయై నమః , ఓంలోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓంపద్మాక్ష్యై నమః

ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓంపద్మముఖియై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః

ఓం రమాయై నమః, ఓంపద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మ గంధిన్యైనమః

ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాదాభిముఖీయైనమః, ఓం ప్రభాయై నమః

ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓంచంద్రసహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః

ఓం చంద్ర రూపాయై నమః , ఓంఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః

ఓం పుష్ట్యెనమః, ఓం శివాయై నమః, ఓం శివకర్యై నమః, ఓం సత్యై నమః , ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః

ఓం దారిద్ర నాశిన్యై నమః, ఓం ప్రీతా పుష్కరిణ్యైనమః, ఓం శాంత్యై నమః, ఓం శుక్లమాలాంబరాయై నమః

ఓం శ్రీయై నమః, ఓంభాస్కర్యై నమః, ఓం బిల్వ నిలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యైనమః

ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారాంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓంహేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్యై నమః

ఓం సిద్ధ్యై నమః, ఓం త్రైణసౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం నృపవేశగతానందాయై నమః, ఓంవరలక్ష్మ్యై నమః , ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓంహిరణ్యప్రాకారాయై నమః, ఓం సముద్రతనయాయై నమః

ఓం జయాయై నమః, ఓంమంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః, ఓం ప్రసన్నాక్ష్యైనమః, ఓం నారాయణసీమాశ్రితాయై నమః, ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః, ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః

ఓం మహాకాళ్యై నమః, ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః, ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః, ఓంభువనేశ్వర్యై నమః

కంకణపూజ

కంకణాన్ని అమ్మవారి వద్ద పెట్టి అక్షతలతో ఈ క్రింది విధంగా పూజ చేయాలి.

కమలాయైనమః – ప్రథమగ్రంథిం పూజయామి, రమాయైనమః – ద్వితీయ గ్రంథింపూజయామి,

లోకమాత్రేనమః – తృతీయ గ్రంథింపూజయామి, విశ్వజనన్యైనమః – చతుర్థగ్రంథింపూజయామి,

మహాలక్ష్మ్యై నమః – పంచమగ్రంథిం పూజయామి, క్షీరాబ్ది తనయాయై నమః – షష్ఠమ గ్రంథిం పూజయామి,

విశ్వసాక్షిణ్యై నమః – సప్తమగ్రంథిం పూజయామి, చంద్రసోదర్యైనమః – అష్టమగ్రంథిం పూజయామి,

శ్రీ వరలక్ష్మీయై నమః – నవమగ్రంథిం పూజయామి.

ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి

బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం

పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే వ్రత.

Varalakshmi Vratham 2021 : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఎందుకు చేస్తారో తెలుసా ? వ్ర‌తం ఎలా చేయాలి ? పూర్తి విధానం, దాంతో క‌లిగే లాభాల‌ను తెలుసుకోండి..!

కథ‌

శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికిచెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను.శ్రద్ధగా వినండి.

పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి ఇంద్రాది దిక్పాలకులు పరమశివుడ్ని కీర్తిస్తు న్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది.అది వరలక్ష్మీవ్రతం.దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి.. దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు?ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.

Varalakshmi Vratham 2021 : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఎందుకు చేస్తారో తెలుసా ? వ్ర‌తం ఎలా చేయాలి ? పూర్తి విధానం, దాంతో క‌లిగే లాభాల‌ను తెలుసుకోండి..!

పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు గోడలతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒకబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు ఉన్న యోగ్యురాలు. రోజూ తెల్లవారుజామునే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరిం.. ఇంట్లో పనులు పూర్తిచేసుకుని అత్తమామల్ని సేవిస్తూ ఉండేది. వరలక్ష్మీదేవి ఒకరోజు చారుమతికి కలలో కనిపించింది. ఓ చారుమతీ..ఈ శ్రావణపౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలనుఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి.. ఈవిషయం అత్తింటివారికి చెప్పింది. శ్రావణ శుక్రవారం రోజున ఇరుగు పొరుగు ముత్తైవుదులను పిలిచి ఇంట్లోనే మండపం ఏర్పాటు చేసి అమ్మవారిని షోడశోపచారాలతో పూజించింది. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల కంకణాన్ని చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు.

మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జెలు, రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచిత కంకణాలు, మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వా భరణ భూషితులయ్యారట. వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతితో పాటూ ఆ వ్రతానికి వచ్చిన వారందరి ఇళ్లలో సకల భోగాలు వచ్చాయట. అప్పటి నుంచి వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు కలిగి సుఖ జీవనంతో గడిపి ముక్తిని పొందారు.

Varalakshmi Vratham 2021 : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం ఎందుకు చేస్తారో తెలుసా ? వ్ర‌తం ఎలా చేయాలి ? పూర్తి విధానం, దాంతో క‌లిగే లాభాల‌ను తెలుసుకోండి..!

మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నాను ఈ వ్రతం చేసినను ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు కలిగుతాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు.

ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు పసుపు బొట్టు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి. భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలుకలుగుతాయి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద ఎన్నో ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి.

Tags: lakshmi poojaVaralakshmi VrathamVaralakshmi Vratham 2021ల‌క్ష్మీ పూజ‌వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తంవ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం 2021
Previous Post

పుట్టిన రోజు నాడు కేక్ ను ఎందుకు క‌ట్ చేస్తారో తెలుసా ?

Next Post

పాట పెట్టుకుని ఒక రేంజ్‌లో డ్యాన్స్ చేసిన విష్ణు ప్రియ‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

by IDL Desk
Friday, 21 February 2025, 1:28 PM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
ఆరోగ్యం

Fat Cysts : శ‌రీరంలో ఎక్క‌డ కొవ్వు గ‌డ్డలు ఉన్నా స‌రే.. ఇలా చేస్తే క‌రిగిపోతాయి..!

by Sravya sree
Sunday, 30 July 2023, 8:47 AM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.