దారుణం.. పిల్లల కోసం 10 ఏళ్ల బాలికను చంపి క్షుద్రపూజలు..

August 11, 2021 9:26 PM

ప్రస్తుతం ప్రపంచం ఎంతో ముందుకు పోతుంది.రోజురోజుకు టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందుతూ దూసుకుపోతున్న ఈ ప్రపంచంలో ఇప్పటికీ అక్కడక్కడ గుడ్డిగా మూఢనమ్మకాలను నమ్ముతూ ఎన్నో దారుణాలకు పాల్పడుతున్న వారు కూడా ఉన్నారు. ఈ విధంగా మూఢనమ్మకాలను నమ్ముతూ క్షుద్రపూజలు ప్రాణాలను బలివ్వడం వంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా 10 సంవత్సరాల బాలికను బలిచ్చిన ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

బీహార్లోని ముంగేర్ జిల్లాకు చెందిన దిలీప్‌కు కుమార్‌కు ఐదేళ్ల క్రితం వివాహం అయితే ఐదు సంవత్సరాలలో తన భార్య పలుమార్లు గర్భందాల్చిన అబార్షన్ జరుగుతుంది. ఈ క్రమంలోనే అతను ఎన్నో ఆసుపత్రులకు వెళ్లి చికిత్స తీసుకున్న ఎలాంటి ఫలితం లేకపోవడంతో కొందరి స్నేహితుల సలహా మేరకు పర్వేజ్ ఆలమ్‌ అనే తాంత్రికుడుని కలిశాడు. ఈ క్రమంలోనే పది సంవత్సరాల బాలికను బలి ఇస్తే తన సమస్యకు పరిష్కారం ఉందని చెప్పారు.

తాంత్రికుడు చెప్పిన విధంగానే దిలీప్ 10 సంవత్సరాల బాలికను కిడ్నాప్ చేసి ఆమెను చంపి ఆమె కళ్ళతో రక్తంతో క్షుద్రపూజలు చేశారు. పొలంలో ఉన్న తండ్రికి భోజనం తీసుకు వెళుతున్న చిన్నారి తిరిగి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలోనే మరుసటి రోజు ఆ గ్రామ శివారులో బాలిక మృతదేహం కనపడటంతో పోలీసులు అసలు విషయం తెలుసుకొని దిలీప్ ను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా దిలీప్ జరిగిన విషయం తెలియజేశారు.ఈ క్రమంలోనే చిన్నారి కుటుంబ సభ్యులు అతనికి కఠినమైన శిక్ష విధించాలని పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment