తెలంగాణలో మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే!

August 8, 2021 7:31 PM

ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో దేశంలోనే పలు రాష్ట్రాలలో ఖాళీగా ఉన్నటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పోస్టులను భర్తీ చేయడానికి ఆయా రాష్ట్రాలు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(DMHO) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి 10 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఎంబీబీఎస్ చేసే ఉండాలి. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 34 సంవత్సరాలు మించకూడదు.

ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మెరిట్, రోల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.ఈ క్రమంలోనే ఆసక్తిగల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 10వ తేదీ ఆఖరి తేదీ. ఈ తేదీలోగా అభ్యర్థులు తమ దరఖాస్తులను DMHO కార్యాలయం అందజేయగలరు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now