IDBI బ్యాంకులో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే!

August 6, 2021 8:55 PM

మీరు బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు ఇది శుభవార్తే.. ముంబై ప్రధానంగా పనిచేస్తున్నటువంటి ఇండస్ర్టియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (IDBI) ఒప్పంద ప్రాతిపదికనఖాళీగా ఉన్నటువంటి 920 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేవారు ఆగస్టు 18 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అభ్యర్థులు క్రింది తెలిపిన అధికారిక వెబ్ సైట్ సంప్రదించవలెను.https://www.idbibank.in/

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు జులై 1 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఎస్టీ ఎస్సీ ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 200 రూపాయలు పరీక్ష రుసుం చెల్లించాలి.ఇతరులు పరీక్ష రుసుం వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 5న అభ్యర్థులకు రాత పరీక్షను నిర్వహిస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now