యాంకర్ సుమను అక్కా అన్న గంగవ్వ.. స్టార్ట్ మ్యూజిక్ లో గంగవ్వ రచ్చ రచ్చ!

August 7, 2021 3:42 PM

బుల్లితెరపై యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే స్టార్ మాలో ప్రసారమయ్యే “స్టార్ట్ మ్యూజిక్” కార్యక్రమానికి సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమవుతుంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా.

gangavva said akka to suma

ఈ ప్రోమోలో భాగంగా ఈవారం ప్రసారమయ్యే కార్యక్రమానికి యూట్యూబ్ స్టార్ గంగవ్వ వచ్చారు. యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన గంగవ్వ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన గ్రామీణ జీవితాన్ని అద్భుతంగా వివరిస్తూ ఈమె చేసే వీడియోల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అదేవిధంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లి మరింతమందికి చేరువయ్యారు.

ఈ విధంగా యూట్యూబ్ ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న గంగవ్వ సుమ స్టార్ట్ మ్యూజిక్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న గంగవ్వ అందరూ సుమను ఏ విధంగా పిలుస్తారో అదేవిధంగా సుమక్కా అని పిలువగా.. సుమక్కా అంటూ సుమ షాక్ అయ్యి చెయ్యి అడ్డుపెట్టి ఆపు అని అంటుంది. దీంతో ఈ కార్యక్రమానికి వచ్చిన వారు ఎంతో గట్టిగా నవ్వుకుంటారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now