వినాయకుడిని ఏకదంతుడు అని ఎందుకు పిలుస్తారు తెలుసా ?

August 4, 2021 4:11 PM

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యం లేదా పండుగలు చేసినప్పుడు ముందుగా వినాయకుడికి పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విధంగా వినాయకుడికి పూజ చేయటం వల్ల ఆ కార్యానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా శుభకార్యం పూర్తవుతుందని భావిస్తారు. అందుకే తొలిపూజను వినాయకుడికే చేస్తారు. అయితే వినాయకుడిని గణనాథుడు, విగ్నేశ్వరుడు, లంబోదరుడు, ఏకదంతుడు వంటి వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. మరి వినాయకుడిని ఏకదంతుడు అని ఎందుకు పిలుస్తారు ఇక్కడ తెలుసుకుందాం..

పార్వతి దేవి వినాయకుడిని ప్రతిష్ఠించి తనకు ప్రాణం పోసిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే వినాయకుడిని కైలాస ద్వారం వద్ద కాపలాగా ఉంచుతుంది.ఈ క్రమంలోనే కైలాసంలోకి వెళ్లాలని వచ్చిన పరమేశ్వరుడిని వినాయకుడు అడ్డుకోవడంతో వినాయకుడు ఎంతో ఆగ్రహం చెంది వినాయకుడి తలను ఖండిస్తాడు. ఈ క్రమంలోనే వినాయకుడికి ఏనుగు తలను తీసుకువచ్చి సమర్పిస్తారు. అందుకే వినాయకుడిని గజముఖుడు అని కూడా పిలుస్తారు.

ఈ క్రమంలోనే ఒకసారి శివపార్వతులు ఏకాంతంలో సమయంలో ఉండగా వినాయకుడు కైలాస ద్వారం వద్ద కాపలా ఉంటాడు. ఈ క్రమంలోనే పార్వతీపరమేశ్వరుల దర్శనం కోసం పరశురాముడు కైలాసానికి చేరుకుంటాడు. కైలాసానికి వచ్చిన పరశురాముని వినాయకుడు బయటనే ఉంచి అతనిని లోపలికి పంపకుండా అడ్డుకుంటాడు. ఇలా వీరిరువురి మధ్య మాటల యుద్ధం మొదలవడంతో వినాయకుడు తన తొండంతో పరశురాముని పైకెత్తి కింద పడేసాడు. దీంతో ఆగ్రహం చెందిన పరశురాముడు తన గండ్రగొడ్డలితో వినాయకుడి పై దాడి చేయడంతో ఒక దంతం విరిగిపోతుంది. దీంతో అప్పటి నుంచి వినాయకుడిని ఏకదంతుడు అని పిలుస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now