మీ ఫోన్ స్లోగా చార్జ్ అవుతుందా? ఈ 5 చిట్కాలతో నిమిషాల్లో ఫుల్ చార్జింగ్!

నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా ఛార్జ్ అవడం ఒకటి. ఇది సమయాన్ని వృథా చేయడమే కాకుండా, పనుల వేగాన్ని కూడా తగ్గిస్తోంది.

January 26, 2026 9:44 PM
How to enable fast charging in any android mobile settings
స్మార్ట్‌ఫోన్ స్లో చార్జింగ్ సమస్యకు సులభమైన పరిష్కారాలు. Photo Credit: Freepik.

నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా ఛార్జ్ అవడం ఒకటి. ఇది సమయాన్ని వృథా చేయడమే కాకుండా, పనుల వేగాన్ని కూడా తగ్గిస్తోంది. కొత్త ఛార్జర్ లేదా కేబుల్ కొనుగోలు చేసినా కూడా కొన్ని సార్లు బ్యాటరీ గంటల తరబడి ఛార్జ్ కావడం లేదు. నిజానికి ఈ సమస్యకు కారణం కేవలం హార్డ్‌వేర్ మాత్రమే కాదు. ఫోన్‌లోని కొన్ని సెట్టింగ్స్, బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తున్న యాప్స్ కూడా ఛార్జింగ్ వేగాన్ని తగ్గిస్తున్నాయి. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే, ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేసుకునేందుకు కొన్ని ముఖ్యమైన సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్యాక్ గ్రౌండ్ యాక్టివిటీ..

ఫోన్ ఛార్జింగ్ నెమ్మదిగా జరిగేందుకు ప్రధాన కారణాల్లో ఒకటి బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ. మనం స్క్రీన్ ఆఫ్ చేసినా కూడా నెట్‌వర్క్ సిగ్నల్స్, మొబైల్ డేటా, వైఫై, లొకేషన్ సర్వీసులు, నోటిఫికేషన్లు వంటి ఫీచర్లు యాక్టివ్‌గా ఉంటాయి. అంతేకాకుండా చాలా యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో కొనసాగుతూనే ఉంటాయి. ఇవన్నీ బ్యాటరీపై అదనపు భారం వేస్తాయి. ఫలితంగా ఛార్జర్ నుంచి వచ్చే పవర్‌లో కొంత భాగం ఫోన్ వినియోగానికి ఖర్చవుతుంది, బ్యాటరీకి పూర్తిగా చేరదు. అందుకే ఛార్జింగ్ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. ఈ సమస్యకు సులభమైన పరిష్కారం ఎయిర్‌ప్లేన్ మోడ్. ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్న సమయంలో ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేస్తే నెట్‌వర్క్ సిగ్నల్స్, మొబైల్ డేటా, వైఫై, బ్లూటూత్, లొకేషన్ సర్వీసులు అన్నీ ఆఫ్ అవుతాయి. దీంతో ఫోన్‌లో బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ దాదాపుగా నిలిచిపోతుంది. బ్యాటరీపై లోడ్ తగ్గుతుంది. అప్పుడు ఛార్జర్ నుంచి వచ్చే శక్తి నేరుగా బ్యాటరీకి చేరి వేగంగా ఛార్జ్ అవుతుంది. ముఖ్యంగా త్వరగా బ్యాటరీ నింపుకోవాల్సిన సమయంలో లేదా ఫోన్ వాడన‌ప్పుడు ఈ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే..

ఇక మరో ముఖ్యమైన అంశం స్క్రీన్‌కు సంబంధించిన ఫీచర్లు. ఆధునిక స్మార్ట్‌ఫోన్లలో ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే అనే ఫీచర్ ఉంటుంది. ఇది స్క్రీన్ ఆఫ్ అయినా కూడా టైమ్, నోటిఫికేషన్లు చూపిస్తూ ఉంటుంది. చాలామంది దీనిని ఎప్పుడూ ఆన్‌లో ఉంచుతారు. కానీ ఇది కూడా ఛార్జింగ్ వేగాన్ని తగ్గించే ఒక కారణం. ఫోన్ త్వరగా ఛార్జ్ కావాలంటే ఈ ఫీచర్‌ను ఆఫ్ చేయడం మంచిది. అలాగే ఛార్జింగ్ సమయంలో స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించడం లేదా పూర్తిగా స్క్రీన్ ఆఫ్‌లో ఉంచడం కూడా బ్యాటరీ వేగంగా ఛార్జ్ కావడానికి సహాయపడుతుంది.

ఫోన్ త్వరగా ఛార్జ్ కావాలంటే ఖరీదైన ఛార్జర్ లేదా కొత్త కేబుల్ మాత్రమే కాదు, సరైన సెట్టింగ్స్ కూడా కీలక పాత్ర పోషిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ తగ్గించడం, ఎయిర్‌ప్లేన్ మోడ్ వాడటం, అవసరం లేని డిస్‌ప్లే ఫీచర్లను ఆఫ్ చేయడం వంటి చిన్న మార్పులు చేస్తేనే ఛార్జింగ్ స్పీడ్‌లో పెద్ద తేడా కనిపిస్తుంది. ఇవి పాటిస్తే రోజువారీ జీవితంలో సమయం కూడా ఆదా అవుతుంది, ఫోన్ పనితీరు కూడా మెరుగుపడుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment