టెక్ మ‌హీంద్రాలో ఉద్యోగాలు.. నేరుగా ఇంట‌ర్వ్యూకే హాజ‌ర‌వండి.. తేదీ ఎప్పుడంటే..?

January 15, 2026 9:13 PM

దేశంలోని ప్రముఖ మ‌ల్టీనేష‌న‌ల్ ఐటీ స‌ర్వీస్ అండ్ క‌న్స‌ల్టింగ్ కంపెనీ టెక్ మ‌హీంద్రా ప‌లు విభాగాల్లో ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులకు నేరుగా ఇంట‌ర్వ్యూల ద్వారా ప్ర‌వేశాల‌ను క‌ల్పిస్తోంది. ఫిబ్ర‌వ‌రి 8వ తేదీన హైద‌రాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న టెక్ మ‌హీంద్రా కార్యాల‌యంలో ఉద‌యం 9.30 నుంచి మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల మ‌ధ్య ఈ ఇంట‌ర్వ్యూల‌ను నిర్వ‌హిస్తారు. మాదాపూర్ హైటెక్‌సిటీలో ఉన్న ఎస్ఈజ‌డ్ గేట్ 2, ఇన్ఫోసిటీ స్పెష‌ల్ ఎక‌నామిక్ జోన్‌, ట‌వ‌ర్ 2, ప్లాట్ నం.22 నుంచి 34 వ‌ర‌కు ఉన్న చిరునామాలో టెక్ మ‌హీంద్రా కార్యాల‌యం ఉంది. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న వారు ఈ చిరునామాలో ఆ తేదీన జ‌ర‌గ‌బోయే ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రు కావ‌చ్చు.

టెక్ మ‌హీంద్రాలో ఎలక్ట్రిక‌ల్ ఇంజినీర్‌, సీనియ‌ర్ ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీర్‌, లీడ్ ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీర్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ ఇంజినీర్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీర్ పోస్టుల‌కు డిప్లొమా చ‌దివిన వారు అర్హులు. సీనియ‌ర్ ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీర్ పోస్టుల‌కు సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ చ‌దివి ఉండాలి. ఇన్‌స్ట్రుమెంటేష‌న్ ఇంజినీర్ పోస్టుల‌కు సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటీఎక్ చ‌దివి ఉండాలి. ప‌ని అనుభ‌వం ఉన్న‌వారికి ప్రాధాన్య‌త ఇస్తారు.

tech mahindra hyderabad electrical engineer posts 2025 recruitment

ఈ పోస్టుల‌కు ఎలాంటి ద‌ర‌ఖాస్తు చేయాల్సిన ప‌నిలేదు. పైన చెప్పిన చిరునామా, తేదీ, స‌మ‌యం నాడు జ‌రిగే ఇంటర్వ్యూల‌కు అభ్య‌ర్థులు త‌మ ధ్రువ‌ప‌త్రాలు, రెజ్యూమ్‌తో హాజ‌రు కావ‌చ్చు. మ‌రిన్ని వివ‌రాల‌కు గాను AB001076800@techmahindra.com అనే చిరునామాకు ఈ-మెయిల్ పంప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now