హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.12 ల‌క్ష‌లు..

January 15, 2026 9:13 PM

ప్ర‌ముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ దేశ‌వ్యాప్తంగా ఉన్న త‌న శాఖ‌ల‌లో ప‌లు విభాగాల్లో ప‌నిచేయ‌డానికి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు బ్యాంక్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) సహకారంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వారు భారీగా ఉద్యోగాల భ‌ర్తీకి ఒక నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేశారు. ఇందులో భాగంగా మొత్తం 500 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తారు. ఈ పోస్టుల‌కు గాను అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. వ‌య‌స్సు 35 ఏళ్ల‌కు మించ‌కూడ‌ద‌ని నోటిఫికేష‌న్‌లో ఇచ్చారు. ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. అనుభ‌వం ఉన్న వారికి ప్రాధాన్య‌త‌ను ఇస్తారు.

ఈ పోస్టుల‌కు గాను అభ్య‌ర్థులు ముందుగా ఆన్‌లైన్ టెస్ట్ రాయాలి. ఇందులో ఉత్తీర్ణ‌త సాధిస్తే ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు దేశంలోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో ప‌నిచేయాల్సి ఉంటుంది. రాత ప‌రీక్ష‌ల‌కు గాను హైదరాబాద్, వైజాగ్, దిల్లీ, అహ్మదాబాద్, వడోదర, బెంగళూరు, మంగళూరు, భోపాల్, ముంబై, పుణె, అమృత్ సర్, జయపుర, లక్నో, కోల్‌క‌తాల‌లో సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు.

HDFC Bank Job Recruitment 2025 know full details

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసేందుకు ఫిబ్ర‌వ‌రి 7ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. రాత ప‌రీక్ష‌ను ఆన్ లైన్‌లో మార్చి నెల‌లో నిర్వ‌హిస్తారు. మ‌రింత స‌మాచారం కోసం https://www.hdfcbank.com/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను అభ్య‌ర్థులు సంద‌ర్శించ‌వ‌చ్చు. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్యర్థుల‌కు నెల‌కు వేత‌నం రూ.3 ల‌క్ష‌ల నుంచి రూ.12 ల‌క్ష‌ల వ‌ర‌కు చెల్లించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now