క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

January 15, 2026 9:13 PM

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్త్రీ’ మూవీ బాలీవుడ్ బాక్సాపీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ‘స్త్రీ2’ మూవీ ఈ యేడాది ఆగష్టు 15న విడుదలై సంచలన విజయం సాధించింది. తొలి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ సృష్టించింది. తొలి రోజు ఈ సినిమా రూ. 55.40 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ముందు రోజు ప్రీమియర్స్ ద్వారా 9.40 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా తొలి రోజు ఈ సినిమా 64.80 కోట్ల నెట్ వసూళ్లతో బాలీవుడ్ లో సంచలనం రేపింది.

శ్రద్దా కపూర్, రాజ్ కుమార్ రావ్ రెమ్యునరేషన్లు, ఇతర సాంకేతిక నిపుణుల పారితోషికంతోపాటు ఈ ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమాను 60 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ మూవీకి భారీ ఆదరణ ఉండటంతో సుమారుగా 5500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.ఈ చిత్రం హిందీ సినిమా పరిశ్రమలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు షారుక్ నటించిన జవాన్ సినిమా సాధించిన అత్యధిక వసూళ్ల రికార్డును, యానిమల్, హృతిక్ రోషన్ ఫైటర్ లైఫ్ టైమ్ కలెక్షన్లను అధిగమించింది. హిందీ సినిమా రంగంలో ఇప్పటి వరకు జవాన్ చిత్రం 584 కోట్ల రూపాయలతో అత్యదిక వసూళ్లు సాధించిన సినిమాగా ఘనతను సాధించింది. తాజాగా స్త్రీ 2 చిత్రం 586 కోట్ల రూపాయలు వసూలు చేయడం ద్వారా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

stree 2 movie all time high record collections in bollywood

తొలి భాగం కంటే బ్లాక్ బస్టర్ గా నిలిచింది స్త్రీ2. ఈ సీక్వెల్లో కొత్తగా సర్కటా అనే దెయ్యాన్ని చూపించారు. నవ్విస్తూనే భయపెడుతున్న ఈ సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఎగబడుతున్నారు. ఇక థియేటర్లలో ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తున్నా.. స్త్రీ2 మూవీ త్వరలోనే ఓటీటీలో అడుగుపెట్టనుంది. సెప్టెంబర్ 27 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లోకి రానుందని భావిస్తున్నారు. అయితే ఫ్రీగా కాకుండా రెంట్ విధానంలో మూవీ వచ్చే అవకాశం ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now