KTR : మీ పాల‌న నుంచి తెలంగాణ‌ను కాపాడుకుంటాం.. కేటీఆర్‌..

January 15, 2026 9:13 PM

KTR : తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. సంద‌ర్భం వ‌చ్చిన ప్ర‌తిసారి కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. రీసెంట్‌గా కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో మీరు గూండాయిజం, దౌర్జ‌న్యం చేసిన కూడా మీ కాంగ్రెస్ గూండాల‌కి బీఆర్ఎస్ ద‌ళం భ‌య‌ప‌డ‌దు. తెలంగాణ‌లోని ప్ర‌తి అంగుళం మేము కాపాడుకుంటాం అంటూ కేటీఆర్ అన్నారు. మీరు చేసే ప్ర‌తి ప‌ని మ‌మ్మ‌ల్ని మ‌రింత స్ట్రాంగ్‌గా మారుస్తుంది. కౌశిక్ రెడ్డి బ‌లంగా నిల‌బ‌డండి, మీ వెన‌క మేము ఉన్నామంటూ కేటీఆర్ త‌న ట్వీట్‌లో తెలియ‌జేశారు. మరోవైపు రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని దుయ్యబట్టారు.

రైతు రుణమాఫీ పేరుతో వారిని వంచనకు గురిచేసి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుందని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాటిచ్చిన రేవంత్.. మాట తప్పటంతో పాటు అర్హులకు రుణమాఫీ చేయకుండా వారి ప్రాణాలను బలితీసుకుంటున్నారని ధ్వజమెత్తారు.రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదు. రుణమాఫీ కాలేదని కొందరు, పెట్టుబడి సాయం రైతు భరోసా లేక కొందరు ప్రాణాలు వదులుకోవడం ఆందోళనకరం. కేసీఆర్ గారు రైతును రాజును చేస్తే ఈ కాంగ్రెస్ సర్కార్ ప్రాణాలు తీస్తుంది. ముఖ్యమంత్రి చేసిన తీరని ద్రోహానికి ఇంకా ఎంతమంది రైతులు ప్రాణాలను బలిపెట్టాలి ? ఏకకాలంలో అందరికీ 2 లక్షల రుణమాఫీ అని ఇచ్చిన మాటతప్పిన సీఎంను ఏం చేయాలి ? అని కేటీఆర్ అన్నారు.

KTR said they will save telangana from congress party
KTR

హైడ్రా పేరిట నిరుపేద‌ల ఇండ్ల‌ను కూల‌గొడుతున్న రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిరుపేద‌ల ఇండ్ల మీద‌కు వెళ్లిన‌ట్లు.. మీ అన్న తిరుప‌తి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి మీదికి బుల్డోజ‌ర్‌ను పంపించే ధైర్యం మీకు ఉందా..? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్ర‌శ్నించారు.ఉన్న ఒక గూటినీ మీ బుల్డోజర్‌ ప్రభుత్వం కూల్చివేస్తే, కడుపుమండి, కన్నీళ్ళతో కిరసనాయిలు పోసుకున్నందుకు కేసులు పెడతారా అంటూ కేటీఆర్‌ ప్రశ్నించారు. ఎంత సిగ్గుచేటు, ఎంతటి నీతిమాలిన చర్య, మీది ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన కాదు రేవంత్‌ రెడ్డి, మీరు నడుపుతున్నది బుల్డోజర్‌ ప్రభుత్వం! కేసుల రాజ్యమంటూ తీవ్ర స్థాయిలో ఎక్స్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Stories