Jr NTR : తాత‌గారిలా పేరు తెచ్చుకోవాలి.. మోక్ష‌జ్ఞ‌కు ఎన్‌టీఆర్ స‌ల‌హా..

January 15, 2026 9:13 PM

Jr NTR : నంద‌మూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యం వ‌చ్చేసింది. నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ తేజ ఎట్ట‌కేల‌కు సినీ రంగ ప్ర‌వేశం చేయనున్నాడు. ఇటీవ‌లే మోక్ష‌జ్ఞ త‌న శ‌రీరాన్ని పూర్తిగా మేకోవ‌ర్ చేసుకుని స్టైలిష్ లుక్‌లో క‌నిపించాడు. దీంతో సినిమాల్లోకి ఎంట్రీ కోస‌మే మోక్ష‌జ్ఞ అలా చేశాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ వార్త‌లు ఇప్పుడు నిజ‌మే అయ్యాయి. త్వ‌ర‌లోనే మోక్ష‌జ్ఞ వెండితెర‌పై క‌నిపించ‌నున్నాడు.

ఇక మోక్ష‌జ్ఞ మొద‌టి సినిమాను హ‌నుమాన్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించ‌నున్నారు. ప్ర‌శాంత్ వ‌ర్మ ఇప్ప‌టికే ప‌లు చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. హ‌నుమాన్ 2కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డంతోపాటు ప్ర‌ముఖ నిర్మాత‌ డీవీవీ దానయ్య కుమారుడు దాస‌రి క‌ల్యాణ్‌ను ప్ర‌శాంత్ వ‌ర్మ వెండి తెర‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో అధీరా అనే సినిమా రాబోతోంది. అయితే ప్ర‌శాంత్ వ‌ర్మ త‌న ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాటిక్ యూనివ‌ర్స్ (PVCU)లో భాగంగా బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్‌సింగ్‌తో క‌లిసి ఒక సినిమా చేద్దామ‌నుకున్నారు. కానీ అనుకోని కార‌ణాల వ‌ల్ల ర‌ణ్‌వీర్‌సింగ్ ఆ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నారు.

Jr NTR wished nandamuri mokshagna a very good luck for his new film
Jr NTR

జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌, క‌ల్యాణ్ రామ్ శుభాకాంక్ష‌లు..

ఇక ప్ర‌స్తుతం మోక్ష‌జ్ఞ మొద‌టి చిత్రానికి ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విష‌యంపై పోస్టు పెట్టారు. నంద‌మూరి తార‌క రామ మోక్ష‌జ్ఞ తేజ మొద‌టి సినిమాకు ద‌ర్వ‌క‌త్వం వ‌హిస్తుండ‌డం సంతోషంగా ఉంది, మోక్ష‌జ్ఞ త‌న కెరీర్‌లో ఎన్నో హిట్ చిత్రాలు చేయాల‌ని కోరుకుంటున్నాన‌ని తెలిపారు. అలాగే మోక్ష‌జ్ఞ సోద‌రులు అయిన జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌, కల్యాణ్ రామ్‌లు కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గా మోక్ష‌జ్ఞకు శుభాకాంక్ష‌లు తెలిపారు. మోక్ష‌జ్ఞ సినిమా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టినందుకు శుభాకాంక్ష‌లు చెబుతూ అత‌ను త‌మ తాత సీనియ‌ర్ ఎన్‌టీఆర్‌లా నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాల‌ని కోరుకుంటున్నామ‌ని వారు వేర్వేరుగా పోస్టులు పెట్టారు.

అయితే మోక్ష‌జ్ఞ ఎట్ట‌కేల‌కు తెరంగేట్రం చేస్తుండ‌డంతో నంద‌మూరి ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా ఫీల‌వుతున్నారు. అప్ప‌ట్లో మోక్ష‌జ్ఞ లుక్ ను చూసి అభిమానులు బెంబేలెత్తిపోయారు. కానీ ఈ మ‌ధ్యే మేకోవ‌ర్ అయి స్టైలిష్‌గా మారిపోయాడు. దీంతో సినిమాల్లో క‌న్‌ఫామ్ అనుకుంటుండ‌గానే స‌డెన్‌గా సినిమా ఎంట్రీని అనౌన్స్ చేసేశారు. ఇక మోక్ష‌జ్ఞ వెండితెర‌పై ఎలా న‌టిస్తాడో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now