Vinayaka Chavithi 2024 : ఈసారి వినాయ‌క చ‌వితి నాడు ముహుర్తం ఎప్పుడు ఉంది..? పూజ చేసేట‌ప్పుడు వీటిని మ‌రిచిపోకండి..!

January 15, 2026 9:13 PM

Vinayaka Chavithi 2024 : ఎప్ప‌టిలాగే ఈ ఏడాది కూడా వినాయ‌క చ‌వితి వ‌చ్చేసింది. ఈసారి కూడా భ‌క్తులు పెద్ద ఎత్తున గ‌ణ‌నాథుల‌ను ప్ర‌తిష్టించేందుకు, న‌వ‌రాత్రుల ఉత్స‌వాల‌ను నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే వినాయ‌కుడికి పూజ‌లు చేసే స‌మ‌యంలో కొన్ని విష‌యాల‌ను మాత్రం మ‌రిచిపోకూడ‌ద‌ని పండితులు చెబుతున్నారు. ఇక ఆ విష‌యాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. వినాయ‌క చ‌వితి రోజున ప్ర‌త్యేక‌మైన దీపాన్ని వెలిగిస్తే మంచిద‌ని పురోహితులు చెబుతున్నారు. ప్ర‌మిద‌లో కొబ్బ‌రినూన పోసి 5 జిల్లేడు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి.

ఇలా దీపం వెలిగిస్తే గ‌ణ‌నాథుడి సంపూర్ణ అనుగ్ర‌హం ల‌భిస్తుంద‌ని అంటున్నారు. 21 ప‌త్రాల‌తో పూజించ‌డం వీలుకాని వారు గ‌రిక పోచ‌ల జంట‌ను వినాయ‌కుడికి స‌మ‌ర్పించినా అంతే ఫ‌లితం క‌లుగుతుంద‌ని చెబుతున్నారు. ఇక పండుగ నాగు ఎరుపు, నీలం రంగు వ‌స్త్రాల‌ను ధ‌రిస్తే మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌ని వారు చెబుతున్నారు. క‌నుక పండితులు చెబుతున్న ఈ విష‌యాల‌ను మ‌రిచిపోకండి. ఇక వినాయ‌క చ‌వితి రోజు మంచి ముహుర్తం ఎప్పుడు ఉంది, పూజ ఎప్పుడు చేయాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Vinayaka Chavithi 2024 know best muhurtham pooja timing and details
Vinayaka Chavithi 2024

మంచి ముహుర్తం ఇదే..

ఈ ఏడాది వినాయ‌క చ‌వితి తిథి సెప్టెంబ‌ర్ 6, 7 తేదీల్లో వ‌చ్చింద‌ని పండితులు చెబుతున్నారు. అయితే ధృక్ సిద్ధాంతం ప్ర‌కారం 7నే (శ‌నివారం) వినాయ‌క చ‌వితి జ‌రుపుకోవాల‌ని సూచిస్తున్నారు. ఉద‌యం 11.03 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల మ‌ధ్య‌లో గ‌ణేశుడి విగ్ర‌హ ప్ర‌తిష్టాప‌న‌కు శుభ ముహుర్తం ఉంద‌ని అన్నారు. సాయంత్రం 6.22 గంట‌ల నుంచి రాత్రి 7.30 గంట‌ల మ‌ధ్య‌లో వ‌ర‌సిద్ధి వినాయ‌క వ్ర‌త సంక‌ల్పం చేసుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు.

ఇక ప్ర‌తిసారి లాగే ఈసారి కూడా మ‌ట్టి వినాయ‌కుల‌నే పూజించాల‌ని ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు కోరుతున్నారు. హిందూ ధ‌ర్మంలో ప్ర‌తి పండుగ‌కు ఒక అర్థం ఉంటుంది. ప్ర‌తి వేడుకా ప‌ర్యావ‌ర‌ణ హితంగా ఉండాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు. గ‌ణేష చ‌తుర్ధికి వాడే పూజ ప‌త్రాల‌న్నీ ప్ర‌కృతి సిద్ధ‌మైన‌వే. మ‌రి పార్వ‌తీ పుత్రుడి విగ్ర‌హాల‌ను మాత్రం ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్‌తో చేసిన‌వి ఎందుకు వాడాలి..? నిమ‌జ్జ‌నం అనంతరం నీటిలో సులువుగా క‌లిసిపోయేలా, ప్ర‌కృతికి ఏమాత్రం హాని క‌లిగించ‌ని రీతిలో ఉండే మ‌ట్టి గ‌ణ‌నాథుల్నే పూజ‌కు వినియోగించాలి. ఆ గ‌ణ‌ప‌య్య కృప‌కు పాత్రులు కావాలి.. అని ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు కోరుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now