Mushrooms : వ‌ర్షాకాలంలో పుట్ట గొడుగుల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

January 15, 2026 9:13 PM

Mushrooms : గ్రామీణ ప్రాంతాల్లో మ‌న‌కు ఈ సీజ‌న్‌లో ఎక్క‌డ చూసినా పొలాలు, చేల గ‌ట్ల మీద పుట్ట‌గొడుగులు ఎక్కువ‌గా ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. ప‌ల్లెటూళ్ల‌లో చాలా మంది పుట్ట‌గొడుగుల‌ను తెంపుకుని వ‌చ్చి తింటుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే మ‌న‌కు సూప‌ర్ మార్కెట్‌ల‌లోనూ పుట్ట గొడుగులు ల‌భిస్తాయి. ఆధునిక యుగం వ‌చ్చిన త‌రువాత మ‌న‌కు పుట్ట‌గొడుగులు కూడా ఏడాది పొడ‌వునా అందుబాటులో ఉంటున్నాయి. అయితే పుట్ట గొడుగుల‌ను ఈ సీజ‌న్‌లో తిన‌డం మాత్రం మరిచిపోవ‌ద్దు. వీటితో మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పుట్ట గొడుగుల‌ను వ‌ర్షాకాలంలో తిన‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పుట్ట‌గొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. అందువ‌ల్ల ఈ సీజ‌న్‌లో వీటిని తింటే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. రోగాల నుంచి త్వ‌ర‌గా కోలుకుంటారు. పుట్ట‌గొడుగుల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. దీంతో హైబీపీ త‌గ్గుతుంది. ఫ‌లితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి.

what happens to your body if you eat Mushrooms in monsoon
Mushrooms

అధిక బ‌రువు త‌గ్గుతారు..

పుట్ట‌గొడుగుల్లో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల వీటిని తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. దీంతో ఆహారం త‌క్కుగా తింటారు. ఫ‌లితంగా శ‌రీరంలో క్యాల‌రీలు త‌క్కువ‌గా చేరుతాయి. దీంతో శరీరం శ‌క్తి కోసం కొవ్వును క‌రిగిస్తుంది. ఫ‌లితంగా అధిక బ‌రువు త‌గ్గుతారు. అందువ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి పుట్ట‌గొడుగులు వ‌ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. వీటిని తింటే విట‌మిన్ డి కూడా స‌మృద్ధిగానే ల‌భిస్తుంది. దీంతో ఎముక‌లు దృఢంగా మారుతాయి. విరిగిన ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కుంటాయి.

పుట్ట‌గొడుగుల‌ను తిన‌డం వ‌ల్ల ఏకాగ్ర‌త‌, జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతాయి. వ‌య‌స్సు మీద ప‌డిన త‌రువాత మ‌తిమ‌రుపు రాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే వీటిని తింటే ఎన్నో ర‌కాల బి విట‌మిన్లు, కాప‌ర్‌, సెలీనియం, థ‌యామిన్‌, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్ వంటి పోష‌కాలు ల‌భిస్తాయి. ఇవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాలు రాకుండా మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి. క‌నుక ఈ సీజ‌న్‌లో పుట్ట‌గొడుగుల‌ను తిన‌డం మ‌రిచిపోకండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now