Samantha : నాగ‌చైత‌న్య ఎంగేజ్‌మెంట్‌.. స‌మంత‌కు ప్ర‌పోజ్ చేసిన ఫ్యాన్‌.. ఆమె రిప్లై ఏమిటంటే..?

January 15, 2026 9:13 PM

Samantha : అక్కినేని నాగ‌చైత‌న్య‌, న‌టి శోభిత ధూళిపాళ ఎంగేజ్ మెంట్ వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అయితే అటు చైతూ ఫ్యాన్స్‌, ఇటు స‌మంత ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో త‌ప్పు మీదంటే మీదని వార్ మొద‌లు పెట్టేశారు. ఈ విష‌యం అటుంచితే నాగ‌చైత‌న్య మ‌ళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు క‌నుక స‌మంత‌కు కూడా ఒక తోడు ఉంటే బాగుంటుంది అనుకున్నాడో ఏమో తెలియ‌దు కానీ ఒక అభిమాని మాత్రం స‌మంత‌కు ప్ర‌పోజ్ చేశాడు. దీంతో ఆమె రిప్లై కూడా ఇచ్చింది. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే..

ముకేష్ చింతా అనే ఓ యువ‌కుడు ఇన్‌స్టాగ్రామ్‌లో స‌మంత‌కు ప్ర‌పోజ్ చేస్తూ ఒక రీల్ చేశాడు. స‌మంత‌.. ఇక నువ్వు ఏమాత్రం ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు, నీకు నేనున్నాను, ఈ ప్ర‌పంచ‌మంతా నీకు వ్య‌తిరేకం అయితే నేను ప్ర‌పంచానికి వ్య‌తిరేకం.. అంటూ రీల్ చేశాడు. అయితే ఈ రీల్ వైర‌ల్ అయి స‌మంత కంట ప‌డింది. దీంతో ఆమె ఈ రీల్‌కు రిప్లై కూడా ఇచ్చింది.

a fan on instagram proposed to Samantha and know what she replied
Samantha

స‌ద‌రు యువ‌కుడు జిమ్‌లో రీల్ చేయ‌డంతో ఆ జిమ్ బ్యాక్‌గ్రౌండ్ త‌న‌కు ఎంతో న‌చ్చింద‌ని ఆమె రిప్లై ఇచ్చింది. అయితే స‌మంత త‌న రీల్‌కు రిప్లై ఇవ్వ‌డంతో ఆ విష‌యాన్ని ఆ యువ‌కుడు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ రూపంలో షేర్ చేశాడు. కాగా వీరి పోస్టులు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే నాగచైత‌న్య ప్ర‌స్తుతం మ‌ళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు క‌నుక స‌మంత కూడా పెళ్లి చేసుకుంటుంద‌ని ఫ్యాన్స్ అంటున్నారు. కానీ ఆమెకు ఉన్న మ‌యోసైటిస్ అనే వ్యాధి కార‌ణంగా ఆమె మ‌ళ్లీ వివాహం చేసుకుంటుందా.. లేదా.. అన్న‌ది స‌స్పెన్స్‌గా మారింది.

ఇక నాగ‌చైత‌న్య‌కు, శోభిత ధూళిపాళ‌కు ఆగ‌స్టు 8వ తేదీన ఉద‌యం 9.42 గంట‌ల‌కు నిశ్చితార్థం జ‌రిగింది. ఈ విష‌యాన్ని నాగార్జున అధికారికంగా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ప్ర‌క‌టించారు. వారిద్దరూ మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్‌లా మంచి క‌పుల్ అవుతార‌ని తాను ఆకాంక్షిస్తున్నాన‌ని, ఇది నాగ‌చైత‌న్య‌కు మ‌రో కొత్త ఆరంభం అని నాగార్జున అన్నారు. కాగా నాగార్జున ట్వీట్ కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now