Post Office RD Scheme : 5 సంవ‌త్స‌రాల పాటు పోస్టాఫీసులో రూ.1000 ఇన్వెస్ట్ చేస్తే ఎంత వ‌స్తుంది అంటే..!

January 15, 2026 9:13 PM

Post Office RD Scheme : మీరు పోస్ట్ ఆఫీస్ ప్రవేశ పెట్టిన ఏ ప్లాన్‌లో అయిన సరే డ‌బ్బు పెట్టుబ‌డి పెడితే మీ డబ్బు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోస్ట్ ఆఫీస్‌లో అనేక పథకాలు ఉన్నాయి. చాలా మంది పెట్టుబడిదారులు తమకు తక్కువ రిస్క్ ఉన్న మంచి రాబడిని పొందగల ఎంపిక కోసం చూస్తున్నారు. పోస్టాఫీస్ లో అదిరిపోయే పథకం అందుబాటులో ఉంది. అదే రికరింగ్ డిపాజిట్ స్కీం. పోస్టాఫీస్ ఆర్డీ ప‌థ‌కం కింద ఐదేళ్ల పాటు ప్ర‌తి నెల కూడా వెయ్యి రూపాయ‌లు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభం ఉంటుంది. ఈ ప‌థకం కింద పోస్ట్ ఆఫీస్ 6.7 శాతం వార్షిక వ‌డ్డీ రేటుని రాబ‌డిగా ఇస్తుంది.

సింగిల్, జాయింట్ అకౌంట్‌కి కూడా ఈ వ‌డ్డీ రేటు కాల‌నుగుణంగా మారుతూ ఉంటుంది. మూడేళ్ల త‌ర్వాత దీనిని రీడిమ్ చేసుకునే అవ‌కాశం కూడా ఉంటుంది. మీరు ప్ర‌తి నెల వెయ్యి రూపాయ‌ల పాటు 5 సంవ‌త్స‌రాలు చెలిస్తే 6.7 శాతం అంటే మీరు ఊహించ‌ని ప్రాఫిట్ ద‌క్కుతుంది ఉదాహ‌ర‌ణకి మీరు ప్ర‌తి నెల రూ1000గా ఐదేళ్ల‌కి అర‌వై వేలు పెట్టుబ‌డి పెట్టారు. ఈ లెక్క‌న చూస్తే రూ.11369 వ‌డ్డీ రేటుని పొంద‌వ‌చ్చు. అంటే 71369 రూపాయ‌లు ప్రాఫిట్ ద‌క్కుతుంది. ఇలా మీరు ఎక్కువ డ‌బ్బు పెట్టుబ‌డి పెట్టిన కూడా మంచి లాభం వ‌స్తుంది.

Post Office RD Scheme how much you can get after 5 years of investment
Post Office RD Scheme

దీనికి సంబంధించి కేంద్రం 3 నెలలకొకసారి వడ్డీరేట్లను సవరిస్తుంది. ఇందులో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 సంవత్సరాలు మాత్రమే. మెచ్యూరిటీ తర్వాత కావాలనుకుంటే ఈ పథకాన్ని మరో 5 సంవత్సరాలు పొడిగించుకునే అవ‌కాశం కూడా ఉంటుంది.. కాక‌పోతే ఇక్క‌డ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో కనీసం రూ.100 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడి పెట్టే వీలుంది. సింగిల్ అకౌంట్ కింద ఒకరు, జాయింట్ అకౌంట్ కింద గరిష్టంగా ముగ్గురు ఈ స్కీంలో చేరొచ్చు. మైనర్ పేరిట గార్డియెన్ ఖాతా తెరవొచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now