RRB Recruitment 2024 : రైల్వేల‌లో భారీగా ఉద్యోగాల భ‌ర్తీ.. 18,799 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

June 23, 2024 7:17 PM

RRB Recruitment 2024 : నిరుద్యోగుల‌కు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజ‌న్ల‌లో భారీగా కొలువుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. కాగా ఈ ఏడాది ఆరంభంలోనే అసిస్టెంట్ లోకో పైల‌ట్ ఉద్యోగాల భ‌ర్తీకి భార‌తీయ రైల్వే శాఖ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అయితే రిక్రూట్‌మెంట్‌ను వాయిదావేశారు. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అందులో భాగంగా త్వ‌ర‌లోనే వివిధ రైల్వే జోన్ల‌లో ఖాళీగా ఉన్న మొత్తం 18,799 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

మొద‌టి ద‌శ‌లో 5,696 అసిస్టెంట్ లోకో పైల‌ట్ పోస్టుల‌కు రిక్రూట్‌మెంట్ ను ఇచ్చారు. కానీ వాయిదా ప‌డ‌డంతో ఇప్పుడు వీటికి అద‌నంగా మ‌రిన్ని పోస్టుల‌ను క‌లిపి మొత్తం 18,799 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఇక ఈ ప్ర‌క‌ట‌న‌ను ఆర్ఆర్‌బీ భోపాల్ విడుద‌ల చేసింది. అయితే ఏమైనా సందేహాలు ఉంటే తమ అధికారిక వెబ్‌సైట్ https://indianrailways.gov.in/ ను సంద‌ర్శించ‌వ‌చ్చ‌ని తెలియ‌జేసింది.

RRB Recruitment 2024 railways released notification for 18799 posts
RRB Recruitment 2024

ఇక ఈ పోస్టులకు ప్రకటన అనంతరం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ లేదా మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ఆధారిత‌ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. ఈ క్ర‌మంలోనే అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు పైన తెలిపిన వెబ్‌సైట్‌ను విజిట్ చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now