PM Awas Yojana : ఈ ప‌థ‌కం కింద ఎలా ద‌ర‌ఖాస్తు చేయాలి ? ఎవ‌రు అర్హులు ? పూర్తి వివ‌రాలు ఇవే..!

June 11, 2024 7:32 PM

PM Awas Yojana : దేశంలోని పౌరుల సొంతింటి క‌లను నిజం చేయ‌డం కోసం కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లులోకి తెచ్చిన ప‌థ‌క‌మే.. ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న‌. ఈ ప‌థ‌కం కింద పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు త‌క్కువ ఖ‌ర్చులోనే ఇంటిని నిర్మించుకోవ‌చ్చు. గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఉండే వారు ఈ ప‌థ‌కానికి అర్హులు. దీన్ని 2015లో జూన్ 25వ తేదీన ప్ర‌ధాని మోదీ ప్రారంభించారు. ఈ ప‌థ‌కం కింద కేంద్ర ప్ర‌భుత్వం ఇంటి రుణాల‌పై స‌బ్సిడీని అందిస్తుంది. ఇంటి య‌జ‌మానికి వ‌చ్చే ఆదాయంపై ఆధార‌ప‌డి స‌బ్సిడీని అందిస్తారు. ఈ ప‌థ‌కం కింద బ్యాంకులు కూడా త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కే ఇంటి రుణాల‌ను అందిస్తున్నాయి. ఈ ప‌థ‌కం కింద ల‌బ్ధి పొందిన వారు తీసుకున్న రుణం మొత్తాన్ని 20 ఏళ్ల‌లోగా చెల్లించాల్సి ఉంటుంది. గ‌త 10 ఏళ్ల నుంచి ఈ ప‌థ‌కం కింద మొత్తం 4.1 కోట్ల మంది ల‌బ్ధి పొందిన‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి.

PM Awas Yojana కు ఎవ‌రు అర్హులు ?

ఈ ప‌థ‌కం కింద ద‌ర‌ఖాస్తు చేసుకునే ల‌బ్ధిదారుడి వ‌య‌స్సు 18 సంవ‌త్స‌రాలు అంత‌క‌న్నా ఎక్కువ ఉండాలి. భార‌తీయ పౌరుడు అయి ఉండాలి. దేశంలో ఎక్క‌డా అత‌ని పేరు మీద ఇల్లు ఉండ‌కూడ‌దు. ల‌బ్ధిదారుడి ఏడాది ఆదాయం రూ.3 ల‌క్ష‌ల నుంచి రూ.6 ల‌క్ష‌ల మ‌ధ్యే ఉండాలి. అంత‌క‌న్నా మించ‌రాదు. ల‌బ్ధిదారుడి రేష‌న్ కార్డు బీపీఎల్ లిస్ట్‌లో ఉండాలి. ఆర్థికంగా వెనుక‌బ‌డిన వారికి ఈ ప‌థ‌కం కింద ల‌బ్ధి అందిస్తారు. ఇక ఇందుకు ఏయే డాక్యుమెంట్లు కావాలో ఇప్పుడు చూద్దాం.

PM Awas Yojana how to apply for this scheme details in telugu
PM Awas Yojana

PM Awas Yojana కు కావ‌ల్సిన ప‌త్రాలు

ఆధార్ కార్డు, పాస్‌పోర్టు సైజ్ క‌ల‌ర్ ఫొటో, స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్‌, బ్యాంకు పాస్‌బుక్‌, మొబైల్ నంబ‌ర్‌, ఆదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం త‌దితర ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఈ ప‌థ‌కం కింద ఆన్‌లైన్‌లో pmaymis.gov.in అనే వెబ్‌సైట్‌లో ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ఈ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాక అందులో హోమ్ పేజీలో ఉండే Pmavasyojana అనే లింక్‌ను క్లిక్ చేయాలి. అందులో రిజిస్ట్రేష‌న్‌పై క్లిక్ చేయాలి. అనంత‌రం వ‌చ్చే ఫామ్ లో అన్ని వివ‌రాల‌ను న‌మోదు చేయాలి. అనంత‌రం డాక్యుమెంట్ల‌ను అప్‌లోడ్ చేయాలి. అనంత‌రం సబ్‌మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయాలి. దీంతో ద‌ర‌ఖాస్తు ఫామ్ స‌బ్‌మిట్ అవుతుంది.

ఆఫ్‌లైన్‌లోనూ ఈ ప‌థ‌కం కింద ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఇందుకు గాను పౌరులు త‌మ‌కు స‌మీపంలో ఉన్న కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్‌ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. అప్లై చేసే స‌మ‌యంలో పైన తెలిపిన అన్ని డాక్యుమెంట్ల‌ను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అక్క‌డ ఒరిజిన‌ల్ ప‌త్రాల‌ను చూపించి జిరాక్స్ కాపీల‌ను ఇవ్వాలి. దీంతో అప్లికేష‌న్ స‌బ్‌మిట్ చేస్తారు. ఈ క్ర‌మంలో మీ వివ‌రాల‌ను ప‌రిశీలించాక మీరు అర్హులైతే మీకు ఈ ప‌థ‌కం కింద ల‌బ్ధి ల‌భిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now