మా ఆయన అమాయకుడంటున్న శిల్పాశెట్టి..!

July 26, 2021 12:15 PM

అశ్లీల చిత్రాల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్టు అయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసును వేగంగా ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే రాజ్ కుంద్రా బాగోతాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే పోలీసులు కుంద్రాకు చెందిన విదేశీ కంపెనీల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ తో పాటు పలు వీడియో టేపులను స్వాధీనం చేసుకున్నారు.

shilpa shetty says her husband is innocent

కాగా విష‌యం ఇంతలా ఉంటే శిల్పాశెట్టి మాత్రం త‌న భ‌ర్త‌ను వెనకేసుకొస్తుండ‌డం విశేషం. త‌న భర్త అశ్లీల చిత్రాలు తీయ‌లేద‌ని, శృంగార సినిమాల‌ను తీశార‌ని, వాటికి, అశ్లీలానికి సంబంధం లేద‌ని శిల్పాశెట్టి తెలిపింది. కాగా 120 అశ్లీల చిత్రాల‌ను తీసేందుకు గాను కుంద్రా దాదాపుగా రూ. 9 కోట్లను ఖర్చు చేసినట్టు తెలిసింది.

ఇక రాజ్ కుంద్రాకి చెందిన‌ వియన్ ఇండస్ట్రీలో డైరెక్టర్ పదవి శిల్పా శెట్టి గ‌తంలో రాజీనామా చేసింది. ఈ క్ర‌మంలో పోలీసులు ఆమె ఎందుకు రాజీనామా చేసింది ? అనే కోణంలో కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్ర‌స్తుతం రాజ్ కుంద్రా పోలీసుల క‌స్ట‌డీలో ఉండ‌గా, అత‌న్ని మ‌రిన్ని రోజుల పాటు అదుపులో ఉంచుకుని అత‌ని నుంచి మరిన్ని వివ‌రాల‌ను రాబ‌ట్ట‌నున్నారు. అత‌నిపై మ‌నీ లాండ‌రింగ్ ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. దీంతో ఆ కోణంలోనూ పోలీసులు కేసును విచారించ‌నున్నారు. అయితే ఇంత జ‌రిగినా మ‌రోవైపు శిల్పాశెట్టి మాత్రం త‌న భ‌ర్త అమాయ‌కుడ‌ని, అత‌న్ని వెన‌కేసుకు వ‌స్తుండ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now