Chintha Chiguru Pulihora : చింత చిగురు పులిహోర త‌యారీ ఇలా.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇదే కావాలంటారు..!

May 16, 2024 4:05 PM

Chintha Chiguru Pulihora : పులిహోర‌.. ఈ పేరు చెప్ప‌గానే చాలా మందికి నోట్లో నీళ్లూర‌తాయి. చింత‌పండు, మిరియాల పొడి, ఇంగువ వేసి చేసే పులిహోర అంటే చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. ముఖ్యంగా ప‌లు ఆల‌యాల్లో పులిహోర‌ను ప్ర‌సాదంగా పెడుతుంటారు. ఇది మ‌రింత టేస్టీగా ఉంటుంది. అయితే చింత చిగురుతోనూ మ‌నం పులిహోర‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. ఇది ఈ సీజ‌న్‌లో మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భిస్తుంది. క‌నుక చింత చిగురుతో పులిహోర‌ను త‌యారు చేసి తింటే జిహ్వ లేచి వ‌స్తుంది. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు. ఇక దీన్ని ఎలా త‌యారు చేయాలో, దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

చింత చిగురు పులిహోర త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చింత చిగురు – ఒక క‌ప్పు, పొడి అన్నం – రెండు క‌ప్పులు, వేరుశ‌న‌గ ప‌ప్పు – మూడు పెద్ద చెంచాలు, శ‌న‌గ‌ప‌ప్పు – రెండు పెద్ద చెంచాలు, ఆవాలు – అర టీస్పూన్‌, మిన‌ప ప‌ప్పు – పెద్ద టీస్పూన్‌, ప‌సుపు – కొద్దిగా, క‌రివేపాకు – నాలుగు రెబ్బ‌లు, ఎండు మిర్చి – 3, నూనె – త‌గినంత‌, ఉప్పు – రుచికి స‌రిప‌డా, ఇంగువ – చిటికెడు.

Chintha Chiguru Pulihora how to make it know the recipe
Chintha Chiguru Pulihora

చింత చిగురు పులిహోర త‌యారీ విధానం..

అన్నం ఉడుకుతున్న‌ప్పుడే ఒక టీస్పూన్ నూనె, చిటికెడు ఉప్పు క‌లిపి పొడిగా వండి చ‌ల్లార్చాలి. అర టీస్పూన్ నూనెలో చింత చిగురును ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు చిన్న‌మంట‌పై వేయించి ప‌క్క‌నుంచాలి. ఇదే క‌డాయిలో నూనె వేసి ఎండు మిర్చి, వేరుశ‌న‌గ గింజ‌లు, శ‌న‌గ ప‌ప్పు, మిన‌ప ప‌ప్పు, ఆవాలు, క‌రివేపాకు, ప‌సుపు, ఇంగువ ఒక్కొక్క‌టిగా వేగ‌నిచ్చి తాళింపుని చిగురుతోపాటు అన్నంలో క‌లిపితే చాలు. ఎంతో రుచిగా ఉండే చింత‌చిగురు పులిహోర రెడీ అవుతుంది. దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. దీన్ని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. లేదా ఆలు ట‌మాటా లాంటి క‌ర్రీల‌తోనూ క‌లిపి తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now