Cool Drinks In Summer : వేస‌విలో శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచే చ‌క్క‌ని కూల్ డ్రింక్స్‌.. ఎలా త‌యారు చేయాలంటే..?

May 3, 2024 7:39 AM

Cool Drinks In Summer : రోజు రోజుకు ఎండ‌లు మండిపోతున్నాయి. ఎండ నుండి సేద తీర‌డానికి ప్ర‌జ‌లు అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాల‌ను చేస్తున్నారు. ఎండ నుండి ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి ప్ర‌జ‌లు ఎక్కువ‌గా శీత‌ల పానీయాల‌ను తీసుకుంటూ ఉంటారు. అయితే వీటిని తీసుకోవడం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి క‌లిగే హాని అంతా ఇంతా కాదు. వీటికి బ‌దులుగా మ‌నం ఇంట్లోనే చాలా సుల‌భంగా డ్రింక్స్ ను త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. అలాగే ఎండ నుండి ఉప‌శ‌మ‌నం కూడా క‌లుగుతుంది. వీటిని త‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం. 5 నిమిషాల్లోనే ఈ డ్రింక్స్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఆరోగ్యానికి మేలు చేయ‌డంతో పాటు ఎండ నుండి ఉప‌శ‌మ‌నాన్ని అందించే రెండు ర‌కాల డ్రింక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సోంపు డ్రింక్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.

సోంపు – ఒక టేబుల్ స్పూన్, క‌ల‌కండ లేదా పంచ‌దార‌ – తీపి రుచికి త‌గినంత‌, మిరియాలు – 10 నుండి 12, యాల‌కులు – 3, బ్లాక్ సాల్ట్ లేదా ఉప్పు – చిటికెడు, నిమ్మ‌ర‌సం – ఒక టేబుల్ స్పూన్.

Cool Drinks In Summer prepare them like this to cool your body
Cool Drinks In Summer

సోంపు డ్రింక్ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో సోంపు, క‌ల‌కండ‌, మిరియాలు, యాల‌కులు, ఉప్పు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ పొడిని గిన్నెలోకి తీసుకుని అందులో నిమ్మ‌ర‌సం, 250 నండి 300 ఎమ్ ఎల్ నీళ్లు పోసి బాగా క‌ల‌పాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి అందులో ఐస్ క్యూబ్స్ వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ డ్రింక్ ను గ్లాస్ లో పోసి పైన పుదీనా ఆకులు, నిమ్మ‌కాయ ముక్క‌తో గార్నిష్ చేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సోంపు డ్రింక్ త‌యార‌వుతుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు.

బెల్లం డ్రింక్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బెల్లం తురుము – ఒక క‌ప్పు, పుదీనా ఆకులు – 6, అల్లం – అర ఇంచు ముక్క‌, నిమ్మ‌ర‌సం – ఒక టేబుల్ స్పూన్, బ్లాక్ సాల్ట్ లేదా ఉప్పు – చిటికెడు.

బెల్లం డ్రింక్ త‌యారీ విధానం..

ముందుగా జార్ లో బెల్లం తురుము, పుదీనా ఆకులు, అల్లం ముక్క‌లు, నిమ్మ‌ర‌సం, ఉప్పు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని గిన్నెలో తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి బెల్లం క‌రిగే వ‌ర‌కు తిప్పుకోవాలి. త‌రువాత ఇందులో ఐస్ క్యూబ్స్, 250 నండి 300 ఎమ్ ఎల్ నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌ర‌వాత గ్లాస్ లో పోసి పైన పుదీనా ఆకుల‌తో గార్నిష్ చేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం డ్రింక్ త‌యార‌వుతుంది. ఇలా ఇంట్లోనే చాలా సుల‌భంగా డ్రింక్ ను త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల ఎండ నుండి ఉప‌శ‌మ‌నం క‌ల‌గ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా హాని క‌ల‌గ‌కుండా ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now