Akshaya Tritiya 2024 : అక్ష‌య తృతీయ నాడు ఈ రాశుల వాళ్ల‌కు రాజ‌యోగం ప‌డుతుంది.. క‌న‌క వ‌ర్షం కురుస్తుంది..!

April 19, 2024 7:34 AM

Akshaya Tritiya 2024 : హిందూ మ‌త‌ప‌ర‌మైన పండుగ‌ల‌ల్లో అక్ష‌య తృతీయ కూడా ఒక‌టి. అక్ష‌య తృతీయ వివాహానికి అనుకూల‌మైన రోజుగా ప‌రిగ‌ణించ‌బ‌డుతుంది. అలాగే బంగారం, వెండి వంటి వాటితో పాటుగా కొత్త వ‌స్తువులు కొన‌డం, కొత్త ప‌నుల‌ను ప్రారంభించ‌డం వంటివి ఏ శుభ ముహుర్తాలు లేకుండా చేయ‌వ‌చ్చు. అలాగే ఈ రోజున ల‌క్ష్మీ దేవిని భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో పూజిస్తూ ఉంటారు. అయితే ఈ సంవ‌త్స‌రం అక్ష‌య తృతీయ నాడు శుక్రుడు అస్త‌మించ‌డం వ‌ల్ల వివాహాలు చేయ‌డం కుద‌ర‌వ‌ని పండితులు చెబుతున్నారు. అక్ష‌య తృతీయ‌ను ప్ర‌తి సంవ‌త్స‌రం వైశాఖ మాసంలోని శుక్ల ప‌క్ష తృతీయ నాడు జ‌రుపుకుంటారు. ఈ సంవ‌త్స‌రం మే10న అక్ష‌య తృతీయ పండుగ‌ను జ‌రుపుకోనున్నాము. ఈ రోజున ల‌క్ష్మీ దేవిని పూజించి వెండి, బంగారం వ‌స్తువులు కొన‌డాన్ని చాలా శుభ‌ప్ర‌దంగా భావిస్తారు. అలాగే ఈ సంవ‌త్స‌రం మే10 అక్ష‌యతృతీయ రోజున గ‌జ కేస‌రి యోగం, ధ‌న యోగం వంటి శుభ యోగాలు ఏర్ప‌డుతున్నాయి.

ఈ యోగాలు ముఖ్యంగా ఈ 3 రాశుల వారికి మ‌రింత శుభ‌ప్ర‌దంగా ఉన్నాయి. వాస్త‌వానికి, అక్ష‌య‌తృతీయ నాడు మేష‌రాశిలో సూర్యుడు మ‌రియు శుక్రుడి క‌ల‌యిక ఉంది. దాని కార‌ణంగా శుక్రాధిత్య యోగం ఏర్ప‌డుతుంది. దీనితో పాటు మీన‌రాశిలో కుజుడు మ‌రియు బుధుడు క‌ల‌యిక ఉంది. దీని వ‌ల్ల ధ‌న‌యోగం అలాగే శ‌ని మూల త్రికోణ రాశి అయిన కుంభ‌రాశిలో ఉండ‌డం వ‌ల్ల శ‌ష యోగం, ఉచ్ఛ రాశి మీన‌రాశిలో కుజుడు ఉండ‌టం వ‌ల్ల మాళ‌వ్య రాజ‌యోగం, వృష‌భ రాశిలో చంద్రుడు, బృహ‌స్ప‌తి క‌ల‌యిక ఉండ‌డం వ‌ల్ల గ‌జ‌కేసరి యోగం ఏర్ప‌డుతోంది. ఇలా అక్ష‌య తృతీయ నాడు అనేక రాజ‌యోగాలు ఏర్ప‌డ‌టం వ‌ల్ల ముఖ్యంగా ఇప్పుడు చెప్పే రాశుల వారికి ఎంతో మేలు క‌ల‌గ‌నుంది. అక్ష‌య‌తృతీయ నుండి రాజ‌యోగం ప‌ట్ట‌బోతున్న రాశుల వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అక్ష‌య‌తృతీయ మేస‌రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. వీరు చేసే ప్ర‌తి పనిలో విజయం సాధిస్తారు. చాలాకాలంలో ఆగిన ప‌నులు కూడా త్వ‌ర‌గా పూర్తి అవుతాయి. కుటుంబ స‌మ‌స్య‌లు తీరుతాయి. భూమి, భ‌వ‌నాలు వంటి వాటిని కూడా కొనుగోలు చేస్తారు.

Akshaya Tritiya 2024 these zodiac sign people will get rich
Akshaya Tritiya 2024

అలాగే ఈ అక్ష‌య‌తృతీయ వృష‌భ‌రాశి వారికి ఎంతో శుభప్ర‌దం. వృష‌భ‌రాశి వారు ఆర్థిక ప్ర‌యోజనాలు ఎక్కువ‌గా పొందుతారు. వీరు చేసే ప్ర‌తిప‌నిలో ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం ఉంటుంది. ప్ర‌శంస‌లు పొందుతారు. ఉద్యోగంలో ఉన్న‌త స్థాయికి ఎదుగుతారు. పాత పెట్టుబ‌డుల వ‌ల్ల లాభం ఉంటుంది. కొత్త వ్యాపారాలు చేయ‌డానికి ఇది మంచి స‌మ‌యం. అలాగే మీన‌రాశి వారికి కూడా ఈ అక్ష‌య‌తృతీయ మంచి విజ‌యాల‌ను తీసుకువ‌స్తుంది. వీరు ప‌డే క‌ష్టానికి పూర్తి ఫ‌లితం ఉంటుంది. అన్ని ప‌నులు కూడా మీకు అనుకూలంగా జ‌రుగుతాయి. ఊహించ‌ని ధ‌న‌లాభం ఉంటుంది. మీరు మీ ల‌క్ష్యాన్ని చేర‌డంలో విజ‌యాన్ని పొందుతారు. ఈ విధంగా ఈ అక్ష‌య తృతీయ ఈ రాశుల వారికి మ‌రింత మేలు చేయ‌నున్న‌ద‌ని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now