మ‌రికొద్ది రోజుల్లో సోద‌రి వివాహం.. అకౌంట్ బ్లాక్ చేశార‌ని క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్న జొమాటో డెలివ‌రీ బాయ్‌..

March 30, 2024 11:09 AM

ప్ర‌స్తుత త‌రుణంలో ఎక్క‌డ చూసినా ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ యాప్స్ ఎక్కువైపోయాయి. ప్ర‌జ‌లు ఏం కావాల‌న్నా చాలా వ‌రకు ఆన్‌లైన్‌లోనే ఆర్డ‌ర్ చేయ‌డం మొద‌లు పెడుతున్నారు. ఇష్ట‌మైన ఫుడ్ కావాలంటే చాలా దూరంలో ఉన్న రెస్టారెంట్‌కు వెళ్ల‌క్క‌ర్లేదు. ఆన్‌లైన్ యాప్‌లో ఆర్డ‌ర్ పెడితే చాలు. గంట లోపే కావల్సిన ఫుడ్ నేరుగా ఇంటికే చేరుతుంది. అయితే ఇదంతా ఒక ఎత్త‌యితే మ‌న‌కు ఫుడ్ అందించేందుకు డెలివ‌రీ బాయ్స్ ప‌డుతున్న క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. వారు స‌కాలంలో ఫుడ్‌ను డెలివ‌రీ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు త‌ప్ప‌వు. కొద్దిగా ఆలస్య‌మైనా వారి జీతంలో కోత ప‌డుతుంది. దీంతోపాటు వారు రోజూ అధిక మొత్తంలో ఆర్డ‌ర్ల‌ను త‌క్కువ స‌మ‌యంలో డెలివ‌రీ చేయాల్సి ఉంటుంది.

ఇలా డెలివ‌రీ బాయ్స్ మ‌న‌కు ఫుడ్‌ను డెలివ‌రీ చేసేందుకు నానా క‌ష్టాలు ప‌డుతుంటారు. అయితే ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ ఓ డెలివ‌రీ బాయ్‌కి మాత్రం కొండంత క‌ష్టం వ‌చ్చింది. దీంతో అత‌ను వీధుల్లో తిరుగుతూ అంద‌రినీ డ‌బ్బులు అడ‌గ‌డం మొద‌లుపెట్టాడు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే.. ఢిల్లీలోని జీటీబీ న‌గ‌ర్‌లో ఓ జొమాటో డెలివ‌రీ బాయ్ క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తూ అంద‌రినీ డ‌బ్బులు అడుగుతున్నాడు. కొద్ది రోజుల్లో త‌న సోద‌రి వివాహం ఉంద‌ని, అందుకు గాను తాను ఖ‌ర్చు పెట్ట‌కుండా పైసా పైసా కూడ‌బెట్టాన‌ని, కానీ ఇప్పుడు జొమాటోలో త‌న అకౌంట్ బ్లాక్ అయింద‌ని, త‌న సోద‌రి వివాహం ఏం పెట్టి చేయాల‌ని అత‌ను భోరున విల‌పిస్తూ అంద‌రినీ స‌హాయం చేయాల‌ని అడ‌గ‌సాగాడు.

zomato delivery boy gets emotional and asked money in delhi

అయితే అత‌ని దీన‌గాథ‌ను ఓ వ్య‌క్తి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ ట్వీట్ కొన్ని గంట‌ల్లోనే వైర‌ల్‌గా మారింది. ఈ క్ర‌మంలో నెటిజ‌న్లు పెద్ద ఎత్తున స్పందిస్తూ జొమాటోకు వ్య‌తిరేకంగా ట్వీట్లు చేయ‌సాగారు. ఇందుకు స్పందించిన జొమాటో వెంట‌నే యాక్ష‌న్ తీసుకుంటామ‌ని, ఆ వ్య‌క్తికి న్యాయం చేస్తామ‌ని, త‌మ‌కు క‌స్ట‌మ‌ర్లు ఎలాగో డెలివ‌రీ బాయ్స్ కూడా అలాగేనని, వారిని ఆదుకుంటామ‌ని ఆ సంస్థ స్ప‌ష్టం చేసింది. అయితే త‌రువాత ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఏది ఏమైనా డెలివ‌రీ బాయ్స్ జీవితాలు ఎలా ఉంటాయో మరోసారి ఈ సంఘ‌ట‌న ద్వారా నిరూపితం అయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now