Clothes Washing : బట్టలుతికిన నీళ్లు కాళ్లపై పోసుకుంటున్నారా..? పుట్టింటి వారికి ఇలా జరుగుతుందని తెలిస్తే అస్సలు చేయరు..!

March 2, 2024 7:54 PM

Clothes Washing : మన దేశంలో అనేక రకాల ఆచార సంప్రదాయాలున్నాయి. వీటిని కొందరు మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తే మరికొందరు పాటిస్తూ ఉంటారు. కాకపోతే ప్రతి ఆచార సంప్రదాయం వెనుక ఏదో ఒక నిగూఢ‌ విషయం ఉందనేది వాస్తవం. అలాంటిది బట్టలుతికిన నీటిని కాళ్లపై పోసుకోవ‌డం ఒక‌టి. అలా చేస్తే పుట్టింటి వారికి అరిష్టం అని పెద్దలు చెపుతుంటారు. నేను కాళ్లపై పోసుకుంటే వారికి ఎలా అరిష్టం అవుతుందని మొండిగా కొందరు ప్రవర్తిస్తే మరికొందరు అలవాటు కొద్దీ ఆ పని చేస్తారు. పెద్దలు చెప్పారని కాకపోయినా దీని గురించిన కొన్ని విషయాలను ఆలోచిద్దాం.

చాలా మంది స్త్రీలు బట్టలు ఉతికిన తర్వాత జాడించేసి ఆ నీళ్ల‌ను పారబోస్తూ తమ కాళ్లపై పోసుకుంటారు. బట్టలు ఉతికిన నీళ్ల‌ను కాళ్ల మీద పోసుకుంటే కాళ్లు శుభ్రమవుతాయని భావించడం ఓ కారణం. దీనిని ఆచారం అనడం కన్నా అలవాటు అంటే బాగుంటుందేమో. స్త్రీలు ఎక్కువ కాలం నీళ్లలో ఉండటం వల్ల కాళ్లు పాడవుతాయి. నీళ్లలో నాని నాని పగుళ్లు వస్తాయి. అలాంటి పగుళ్ల ద్వారా బట్టలు ఉతికినప్పుడు వాటిలోని సూక్ష్మ క్రిములు పగుళ్ల ద్వారా వారి కాళ్లలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.

Clothes Washing women must follow these health tips
Clothes Washing

దాని ద్వారా వారు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కొందరు భర్తలు భార్యలతో అడ్డమైన చాకిరీ చేయించుకుంటారు. అదే భార్యలు కాస్త అనారోగ్యానికి గురైనా చాలు వాళ్లకు సేవ చేయాల్సి వస్తుందన్న భయంతో సేవ చేసే ఓపిక లేక పుట్టింటికి పంపేస్తారు. పుట్టింటివారు కాస్త ఓపికమంతులు, స్థితిమంతులు అయితే ఫ‌ర్వాలేదు. లేకపోతే ఇబ్బందే కదా. అందుకే బట్టలు ఉతికిన నీళ్లు కాళ్లపై పోసుకోకూడదు అంటారు. పుట్టింటి వారికి ఇబ్బంది అని చెప్పే కోణంలో అరిష్టమని చెప్పి ఉండొచ్చు. ఇదీ అసలు సంగతి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now