Vitamin B12 Veg Foods : విట‌మిన్ బి12 కావాలా.. నాన్‌వెజ్ తినాల్సిన ప‌నిలేదు, వీటిని తిన్నా చాలు..!

February 26, 2024 12:06 PM

Vitamin B12 Veg Foods : శారీరకంగానే కాదు, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు కూడా మనకు విటమిన్ బి12 ఎంతగానో అవసరం అవుతుంది. అలాగే మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, శరీరానికి శక్తిని అందించేందుకు కూడా ఈ విటమిన్ మనకు ఉపయోగపడుతుంది. అయితే చాలా మంది విటమిన్ బి12 కేవలం మాంసాహారం ద్వారా మాత్రమే మనకు లభిస్తుందని అనుకుంటారు. కానీ అది పొరపాటు. ఎందుకంటే.. ఈ విటమిన్‌ను మనం శాకాహారాల ద్వారా కూడా పొందవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..

పాలను నిత్యం తాగితే మన శరీరానికి కావల్సిన విటమిన్ బి12లో 20 శాతం వరకు పొందవచ్చు. పాలు విటమిన్ బి12కు మంచి సోర్స్ అని చెప్పవచ్చు. పెరుగులోనూ విటమిన్ బి12 మనకు లభిస్తుంది. నిత్యం పెరుగును తినడం వల్ల మనకు కావల్సిన విటమిన్ బి12లో 51 నుంచి 79 శాతం వరకు ఆ విటమిన్‌ను పొందవచ్చు.

Vitamin B12 Veg Foods take these foods
Vitamin B12 Veg Foods

30 గ్రాముల చీజ్‌లో నిత్యం మన శరీరానికి కావల్సిన విటమిన్ బి12లో 36 శాతం వరకు పొందవచ్చు. బాదంపప్పు, గుమ్మడికాయ విత్తనాలు, బెండకాయలు, అవకాడోలు, ఉల్లిపాయలు తదితర ఆహారాల్లోనూ మనకు కావల్సినంత విటమిన్ బి12 దొరుకుతుంది.

ఇక ఎవరికైనా వారి వయస్సును బట్టి నిత్యం నిర్దిష్టమైన మోతాదులో విటమిన్ బి12 అవసరం అవుతుంది. ఈ క్రమంలో 1 నుంచి 3 ఏళ్ల లోపు వారికి నిత్యం 0.9 మైక్రోగ్రాముల విటమిన్ బి12 అవసరం అవుతుంది. అలాగే 4 నుంచి 8 ఏళ్ల వారికి 1.2 మైక్రోగ్రాములు, 9 నుంచి 13 ఏళ్ల వారికి 1.8 మైక్రోగ్రాములు, ఆపై వయస్సుల వారికి నిత్యం 2.4 మైక్రోగ్రాములు, శిశువులకు 0.5 మైక్రోగ్రాములు, గర్భిణీలకు 2.6 మైక్రోగ్రాములు, పాలిచ్చే తల్లులకు నిత్యం 2.8 మైక్రోగ్రాముల విటమిన్ బి12 అవసరం అవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now