Tomato Juice : రోజూ ట‌మాటా జ్యూస్ తాగితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

February 24, 2024 12:44 PM

Tomato Juice : ట‌మాటాలు.. చూడ‌గానే నోరూరింపజేస్తాయి. వీటిని నిత్యం మ‌నం ఏదో ఒక విధంగా తింటూనే ఉంటాం. అంతెందుకు.. నిత్యం మ‌నం చేసుకునే కూర‌లు దాదాపుగా ట‌మాటాలు లేనిదే పూర్తి కావంటే అతిశ‌యోక్తి లేదు. అంత‌గా మ‌నం వాటిని వాడుతున్నాం. అయితే మీకు తెలుసా..? కూర‌ల్లో క‌న్నా ట‌మాటాల‌ను జ్యూస్‌గా చేసుకుని నిత్యం ఉద‌యాన్నే తాగితే దాంతో ఇంకా అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. టమాటాల్లో బీటా కెరోటిన్, లైకోపీన్ అనబడే పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి వల్లే టమాటాలు ఎరుపు రంగులో ఉంటాయి. ఈ క్రమంలో రోజూ టమాటా జ్యూస్ తాగితే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. టమాటాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు మన శరీరంలో కణజాలం నశించకుండా చూస్తాయి.

త‌రచూ జీర్ణ సమస్యలతో బాధపడేవారు రోజూ ఒక గ్లాస్ టమాటా జ్యూస్ తాగితే ఫలితం ఉంటుంది. దీంతో మలబద్దకం పోయి విరేచనం సాఫీగా అవుతుంది. అలాగే తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. టమాటాల్లో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. టమాటాల్లో పుష్కలంగా ఉండే ఫైటో న్యూట్రియంట్లు రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా చూస్తాయి. దీంతో హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. టమాటాల్లో ఉండే లైకోపీన్, విటమిన్ సి, ఇ, బీటాకెరోటిన్‌లు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. రక్తనాళాల గోడలను దృఢంగా చేస్తాయి.

Tomato Juice many wonderful benefits
Tomato Juice

నిత్యం టమాటా జ్యూస్‌ను తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయే విష, వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. శరీరంలో ఎక్కువగా ఉండే నీరు బయటకు పోతుంది. టమాటాల్లో ఉండే బీటా కెరోటిన్, లుటీన్, విటమిన్ సిలు కంటి సమస్యలను పోగొడతాయి. చూపు స్పష్టంగా ఉంటుంది. శుక్లాలు రాకుండా ఉంటాయి. రోజూ గంటల తరబడి వ్యాయామం చేసే వారికి, శారీరక శ్రమ చేసే వారికి అవసరమైన పోషకాలను టమాటా జ్యూస్ ఇస్తుంది. వారికి మళ్లీ శక్తి లభించి యాక్టివ్‌గా మారుతారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now