తారక్ కొత్త కారు ధర ఎంతో తెలుసా..?

July 24, 2021 12:27 PM

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు కార్లో కొనడం ఎంతో సరదా అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే మార్కెట్లోకి కొత్తగా వచ్చిన కార్లను కొనడం చాలామందికి అలవాటు గా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు హీరోలు కోట్లు ఖర్చు చేసి లగ్జరీ కార్లను కొన్నారు.అయితే ఈ జాబితాలోకి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయారు.

గతంలో ఎన్టీఆర్ ఎంతో ఖరీదైన కారును బుక్ చేశారని త్వరలోనే హైదరాబాద్ చేరుకొని ఉందనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ బుక్ చేసిన లాంబోర్గిని కారు హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఎంతో విలాసవంతమైన, బెస్ట్ ఫీచర్స్ కలిగి ఉన్నటువంటి ఈ లాంబోర్గి కారు కోసం తారక్ ఐదు కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఐదు కోట్ల రూపాయల తారక్ లాంబోర్గి కారు ఇదే నంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున కారు ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే తన కొత్త కారులో తారక్ తన స్నేహితుడు రామ్ చరణ్ ను కలవడానికి వెళ్లారని.. ఎన్టీఆర్ లాంబోర్గి కారు చరణ్ ఇంటి ముందు ఉండటమే ఇందుకు ఉదాహరణ అంటూ ఈ వార్త సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ గా మారింది. అయితే ఇది నిజంగానే తారక్ కారా లేదా అనే విషయం పై ఎన్టీఆర్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now