రూ.2799కే నోకియా కొత్త‌ 4జి ఫీచ‌ర్ ఫోన్‌..!

July 23, 2021 5:25 PM

హెచ్ఎండీ గ్లోబ‌ల్ సంస్థ నోకియా 110 4జి పేరిట ఓ నూత‌న 4జి ఫీచ‌ర్ ఫోన్‌ను భారత్‌లో విడుద‌ల చేసింది. ఆ కంపెనీకి చెందిన లేటెస్ట్ 4జి ఫీచ‌ర్ ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

Nokia 110 4G feature phone launched in india

నోకియా 110 4జి ఫీచ‌ర్ ఫోన్‌లో.. 1.8 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 128ఎంబీ ర్యామ్‌, 48ఎంబీ స్టోరేజ్ ల‌భిస్తున్నాయి. మెమొరీని కార్డు ద్వారా 32 జీబీ వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు. 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంటుంది. ఎఫ్ఎం రేడియో ల‌భిస్తుంది. వైర్డ్‌, వైర్‌లెస్ డ్యుయ‌ల్ మోడ్‌లో రేడియోను ఆప‌రేట్ చేసుకోవ‌చ్చు. ఎంపీ3 ప్లేయ‌ర్ ల‌భిస్తుంది.

ఈ ఫోన్‌లో డ్యుయ‌ల్ సిమ్‌ల‌ను వేసుకోవ‌చ్చు. 4జికి స‌పోర్ట్ ల‌భిస్తుంది. 1020 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంటుంది. ఇది 18 రోజుల స్టాండ్ బైలో ఉండ‌గ‌ల‌దు. అంటే బ్యాట‌రీ బ్యాక‌ప్ ఎక్కువ‌గా ల‌భిస్తుంద‌న్న‌మాట‌.

నోకియా 110 4జి ఫీచర్ ఫోన్ యెల్లో, ఆక్వా, బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్ ధ‌ర రూ.2799 ఉండ‌గా దీన్ని అమెజాన్‌తోపాటు నోకియా ఆన్‌లైన్ స్టోర్‌లో విక్రయిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now