Video: ఆంబులెన్స్ వెళ్తుంటే దారివ్వాల‌నే క‌నీస జ్ఞానం లేని వ్య‌క్తి.. ఇలాంటి వారినేం చేయాలి..!

July 23, 2021 4:14 PM

ఆంబులెన్స్‌లు అనేవి అత్య‌వ‌స‌ర వాహ‌నాలు. ఎవ‌రికైనా ప్రాణాపాయ ప‌రిస్థితి ఉంటే వారిని వెంట‌నే మెరుగైన చికిత్స కోసం ఆంబులెన్స్‌ల‌లో హాస్పిట‌ల్స్ కు త‌ర‌లిస్తుంటారు. అందువ‌ల్ల ఆంబులెన్స్ ల‌కు ఎవ‌రైనా స‌రే దారివ్వాల్సిందే. కానీ ఈ విష‌యంపై కూడా అవ‌గాహ‌న లేని, క‌నీస జ్ఞానం లేని ఓ వ్య‌క్తి ఆంబులెన్స్‌కు దారివ్వ‌లేదు. అయితే చివ‌ర‌కు అత‌ను క‌ట‌క‌టాల పాల‌య్యాడు.

video man did not give way to ambulance arrested by police

క‌ర్ణాట‌క‌లోని ద‌క్షిణ క‌న్న‌డ జిల్లా తొక్కొట్టు, పంప్‌వెల్ మ‌ధ్య జాతీయ ర‌హ‌దారి-66పై తాజాగా ఓ ఆంబులెన్స్ ప్ర‌యాణించింది. దాని ముందట ఓ వ్య‌క్తి కారులో ప్ర‌యాణించాడు. అయితే అత‌ను ఆంబులెన్స్‌కు దారివ్వ‌లేదు. ప‌దే ప‌దే ఆంబులెన్స్ కు అడ్డుగా వ‌చ్చాడు. అదే స‌మ‌యంలో కొంద‌రు ఆ దృశ్యాల‌ను చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైర‌ల్ గా మారింది.

అయితే ఆ వీడియో ఆధారంగా మంగ‌ళూరు పోలీసులు స‌ద‌రు వ్య‌క్తిపై కేసు న‌మోదు చేశారు. అత‌న్ని చ‌ర‌ణ్ (31) అనే వ్య‌క్తిగా గుర్తించారు. దీంతో అత‌నిపై ఐపీసీ సెక్ష‌న్ 279, మోటార్ వెహికిల్ యాక్ట్ 1988 సెక్ష‌న్ 194(ఇ) ప్ర‌కారం పోలీసులు కేసు న‌మోదు చేసి అరెస్టు చేశారు. అయితే అత‌ను కారు ఎందుకు అలా డ్రైవ్ చేశాడు, మ‌ద్యం ఏమైనా సేవించాడా ? అన్న వివరాల‌ను పోలీసులు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఏది ఏమైనా.. సోష‌ల్ మీడియా వ‌ల్ల ఒక వ్య‌క్తి అలా ప‌ట్టుబ‌డ‌డం అభినందించ‌ద‌గిన విష‌యం..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now