Amitabh Bachchan : ముస‌లోడే కాని మ‌హానుభావుడు.. గోడ దూకేవాళ్లం అంటూ కామెంట్స్ చేసిన అమితాబ్..

January 4, 2024 4:18 PM

Amitabh Bachchan : బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఎన్నో సంవ‌త్స‌రాల నుండి ఆయ‌న ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తూ వ‌స్తున్నారు. 81 ఏళ్ల వయస్సులో కూడా చాలా హుషారుగా సినిమాలు, టీవీ షోలు చేస్తున్నాడు. ఇటీవ‌ల ఆయ‌న కౌన్ బనేగా కరోడ్ పతీ సీజన్ 15ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. 2000 జులై 3న ఈ షోకు సంబంధించిన మొదటి సీజన్‌లోని మొదటి ఎపిసోడ్ ప్రసారం అయ్యింది. అప్పటినుంచి ఇప్పటివరకు 15 సక్సెస్‌ఫుల్ సీజన్స్‌ను పూర్తి చేసుకొని పలువురిని కోటీశ్వరులని, చాలామందిని లక్షాధికారులను చేసింది కేబీసీ. ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ’ని అమితాబ్ లేకుండా ఊహించుకోలేమని ఈ 15 సీజన్స్‌ను కేవలం ఆయన హోస్టింగ్‌తో న‌డిపించారు.

ఇక అమితాబ్ బ‌చ్చ‌న్ అప్పుడప్పుడు ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంటూ అల‌రిస్తూ ఉంటారు. తాజాగా తన కాలేజ్ రోజులను గుర్తు చేసుకున్నారు. కౌన్ బనేగా కరోడ్‌పతీ తాజా ఎపిసోడ్‌లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఢిల్లీలో తాను చదువుకున్న రోజులను ఒక్క‌సారిగా గుర్తు చేసుకున్నారు. కాలేజీలో చదివిన ఓలేడీ పాల్గొన్నారు. తాను చదివిన కిరోరీ మల్ కాలేజీలోనే షో కంటెస్టెంట్ కూడా చదవడంతో బిగ్ బీ నాటి జ్ఞాపకాల్ని ప్రేక్షకులతో పంచుకుంటూ కాలేజ్‌లో తాను చేసిన చిలిపి ప‌నులు, అల్లర్లు ఒక్క‌సారి గుర్తు తెచ్చుకున్నారు.

Amitabh Bachchan interesting comments about his life
Amitabh Bachchan

అప్పట్లో నేను హాస్టల్‌లో ఉండి చదువుకునే వాణ్ణి. అయితే ఆహాస్టల్ తో పాటు తాను ఉండే గది కూడా ఓ మూలన ఉండేది. గదిలోంచి చూస్తే ప్ర‌హ‌రీ క‌నిపిస్తుంది. తాము సినిమాలు చూసేందుకు ప్ర‌హ‌రీని, సెక్యూరిటీని దాటుకొని వెళ్ల‌వాళ్లం. తిరిగి ఎవ‌రు చూడ‌కుండా హాస్ట‌ల్‌లోకి వ‌చ్చేవాళ్లం అని బిగ్ బీ అన్నారు. కాలేజీలో నేను చదివిన రోజులన్నీ నిరుపయోగమ‌య్యాయ‌ని అమితాబ్ అన్నారు. అప్ప‌ట్లో తాను ఏం సాధించ‌లేద‌ని చెప్పిన అమితాబ్.. బీఎస్‌సీ డిగ్రీ వల్ల త‌న‌కు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. అప్పట్లో తాను చదువుకుని కూడా లైఫ్ లో ఫెయిల్ అయినట్టు ఫీల్ అయ్యానన్నారు. అలహబాద్‌లోని బాయ్ హైస్కూల్లో తాను చదువుకున్నానని, 1962లో డిగ్రీ పూర్తి చేశానని బిగ్‌బీ తెలిపారు. ఇప్పుడు అమితాబ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now