Tamannaah : షూటింగ్ పూర్తైన ఎనిమిదేళ్ల‌కి త‌మ‌న్నా సినిమాకి మోక్షం.. ఓటీటీలోకి ఎప్పుడు రానుంది అంటే..!

January 3, 2024 7:13 PM

Tamannaah : టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన త‌మ‌న్నా చేయ‌ని ప్ర‌యోగం లేదు. క‌థానాయిక‌గా న‌టించి అలానే ఐటెం సాంగ్స్ చేసింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేసింది.ఈ క్ర‌మంలో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టించిన లేడీ ఓరియెంటెడ్ తెలుగు మూవీ ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి మూవీ 2020లోనే షూటింగ్ పూర్త‌యిన ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ కాలేదు. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మూవీ క్వీన్ సీక్వెల్‌గా ద‌టీజ్ మ‌హాల‌క్ష్మిని రూపొందించారు. 2014లో ఈ సినిమాను షూటింగ్ ప్రారంభిస్తున్న‌ట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 2016లో ఈ సినిమా షూటింగ్ పూర్తయిన ఇప్పటివరకు సినిమాను రిలీజ్ చేయలేదు.

హనుమాన్ డైరెక్ట‌ర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించగా, మూవీకి సంబంధించిన కాపీ రైట్ప్ విషయంలో ప‌లు వివాదాలు ఏర్ప‌డ‌గా, ఆ వివాదాల కారణంగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. ఇక షూటింగ్ అయిన తరువాత రిలీజ్‌కు ఇంత గ్యాప్ రావడంతో దర్శకుడు, హీరోయిన్ తో పాటు ప్రేక్షకులు కూడా ఆ సినిమా గురించి మర్చిపోయారు. ప్రస్తుతం ఓటీటీలో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ చేయాలని మేకర్ సన్నాహాలు వార్త‌లు వ‌స్తున్నాయి. అతి త్వ‌ర‌లోనే ఈ మూవీని ఓటీటీలోకి తీసుకు రావాల‌ని అనుకుంటున్నార‌ట‌.

Tamannaah movie releasing after 8 years of waiting
Tamannaah

ఈ సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో ఇప్ప‌టికే నెట్‌ఫ్లిక్స్‌తో నిర్మాతలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. త్వరలోనే దట్ ఇజ్‌ మహాలక్ష్మి ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లియరెన్స్ కూడా రానుంది. ఈ మూవీలో సిద్దు జొన్నలగడ్డ కీరోల్‌ ప్లే చేశాడు. మ‌రి చాలా లేట్‌గా వ‌స్తున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు త‌మ‌న్నాకి అవ‌కాశాలు స‌న్న‌గిల్లాయి. అడ‌పాద‌డ‌పా ఏదో అలా మెరుస్తూ వెళుతుంది. చూస్తుంటే త‌మ‌న్నా త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్కే అవ‌కాశం ఉన్న‌ట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now