Guppedantha Manasu January 2nd Episode : భద్రకు క్లాస్ పీకిన శైలేంద్ర.. రౌడీలని చితక్కొట్టిన వసుధార.. మళ్ళీ ఒకటైన రిషి, వసు..!

January 2, 2024 10:30 AM

Guppedantha Manasu January 2nd Episode : వసుధార కి ఫోన్ చేస్తాడు రిషి. భర్త గొంతు విని, వసుధారా ఎమోషనల్ అయిపోతుంది. అయితే, రిషి తో ఫోన్ మాట్లాడడం, శైలేంద్ర వింటూ ఉండడంతో వసుధారా మాట మార్చేస్తుంది. రిషి అడిగినా చెప్పదు. తన నోట నుండి చెప్పాలని అనుకుంటాడు. కానీ, వసుధార మాత్రం చెప్పదు. రిషి తో ఫోన్ మాట్లాడిన వసుధారా హడావిడిగా కాలేజ్ నుండి వెళ్ళిపోతుంది. వసుధారని వెతుక్కుంటూ, ఆమె క్యాబిన్లోకి ఫణింద్ర, మహేంద్ర వస్తారు. అక్కడ వాళ్ళకి వసుధారా కనపడుతుంది. వసుధార బయటికి వెళ్లిందని, ఎక్కడికి వెళ్లిందో తనకి చెప్పలేదని అటెండర్ చెప్తాడు. అతని మాటలు విన్న శైలేంద్ర రిషి గురించి వసుధార కి ఏదో సమాచారం తెలిసే ఉంటుందని అనుమాన పడతాడు.

ఎండి క్యాబిన్ లో రిషి ని చూసి అతన్ని గుర్తు చేసుకొని మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. మహేంద్ర ని ఫణీంద్ర ఓదారుస్తాడు. అనుక్షణం వసుధారని ఫాలో అవమని భద్ర కి చెప్తాడు శైలేంద్ర. కానీ, వసుధార బయటికి వెళ్లినా భద్రా మాత్రం కాలేజీ లోనే కనిపించడంతో అతని మీద ఫైర్ అవుతాడు. పని మీద దృష్టి పెట్టమని చెప్తాడు. వసు కాలేజీ లో లేదనే విషయం నువ్వు నాకు చెప్పాల్సింది పోయి, నేను నీకు చెప్పాల్సి వస్తోందని, క్లాస్ పీకుతాడు. ఫోన్ మాట్లాడి ఎవరికీ చెప్పకుండా వసుధార వెళ్ళింది అంటే, రిషి ని కలవడానికి వెళ్లి ఉంటుందని అనుకుంటాడు శైలేంద్ర. రిషి, వసుధార కనబడితే ఇద్దరినీ అక్కడే చంపేయమని వసుధార తో చెప్తాడు.

వసు ఒంటరిగా కనిపించినా, ఆమెను చంపేసి తర్వాతే తన దగ్గరికి రమ్మని గట్టిగా చెప్తాడు. రిషి ని వెతుక్కుంటూ పెద్దయ్య చెప్పిన చోటికి వసుధార వెళుతుంది. కానీ, పెద్దయ్య దగ్గర ఫోన్ లేకపోవడంతో, అతని అడ్రస్ తెలుసుకోవడం ఆమె కి కష్టమవుతుంది. పెద్ద ఆయన తో మాట్లాడిన నెంబర్ కి ఫోన్ చేస్తుంది. అది ఒక షాప్ ఓనర్ నెంబర్ అవడంతో అతడిని పెద్దయ్య అడ్రస్ అడుగుతుంది. అతడు తనకు కూడా పెద్దయ్య అడ్రస్ తెలియదని చెప్తాడు. పెద్దయ్య కోసం వసుధార షాప్ దగ్గర వెయిట్ చేయడం రౌడీలు కనిపెడతారు.

Guppedantha Manasu January 2nd Episode today
Guppedantha Manasu January 2nd Episode

షాప్ దగ్గరికి వచ్చిన పెద్దయ్య వసుధారతో మాట్లాడటం రౌడీలు చూస్తారు. రిషి తన దగ్గరే ఉన్నాడని, నీ గురించి పదే పదే కలవరిస్తున్నాడని వసుధార తో పెద్దయ్య చెప్తాడు. వసుధార ని తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు. వారిని సీక్రెట్ గా రౌడీలు ఫాలో అవుతారు. వసుధార పెద్దయ్య చాలా సమయం అయినా కూడా రాకపోవడంతో రిషి టెన్షన్ పడతాడు. వసుధారా ని వెతుక్కుంటూ తానే బయటికి వెళ్లాలని అనుకుంటాడు.

ఓపిక లేక పోవడంతో, మంచం మీద నుండి లేవలేక పోతాడు. రౌడీలు తమని ఫాలో అవుతున్న విషయం వసుధారా కనిపెడుతుంది. వారికి కనిపించకుండా అక్కడే ఉన్న కర్ర తో రౌడీ తల పై గట్టిగా కొడుతుంది. రౌడీ బాధతో విలువిలాడుతు ఉంటే, అతనికి దొరక్కుండా అక్కడి నుండి తప్పించుకుంటుంది. రిషిని కలుస్తుంది. రిషి ని చూడగానే, వసుధారా ఎమోషనల్ అవుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now