Sarkaaru Noukari OTT : సునీత కొడుకు స‌ర్కారు నౌక‌రి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..!

December 31, 2023 10:30 PM

Sarkaaru Noukari OTT : టాలీవుడ్ టాప్ సింగర్ లలో ఒకరైన సింగర్ సునీత గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. త‌న పాట‌తో పాటు గొంతుతో ఎంతో మందిని వెలుగులోకి తెచ్చింది. యాంక‌ర్‌గా, సింక‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది సునీత‌. అయితే చిన్న‌ప్పుడే పెళ్లి చేసుకున్న సునీత అనుకోని కార‌ణాల వ‌ల‌న అత‌నికి విడాకులు ఇచ్చి ఇద్ద‌రి పిల్ల‌లని త‌న ద‌గ్గ‌ర ఉంచుకొని వారిని పెంచి పెద్ద చేసింది. ఇక వారి పిల్లలే దగ్గర ఉండి సునీత‌కి ఇటీవ‌ల రెండో పెళ్లి చేయడం మరింత హైలెట్ గా నిలిచింది. పెళ్లీడుకు వచ్చిన పిల్లలు ఉన్న ఆమె పెళ్లి చేసుకునేందుకు ఎంతగానో ప్రోత్సహించిన ఆమె పిల్లల్లో పెద్దవాడు ఆకాష్ గోపరాజు.

మెంటల్లీ ఎంతో స్ట్రాంగ్ గా ఉండే ఈయన తాజాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సర్కారు నౌకరి అనే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టబోతుండగా, ఈ చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్‌పై కె. రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆకాశ్‌ సరసన భావన వళపండల్ హీరోయిన్ గా నటించబోతుంది. అలాగే తనికెళ్ల భరణి, సూర్య ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. అద్భుతమైన కథాంశంతో రాబోతున్న ఈ సినిమా జనవరి ఒకటో తేదీన విడుదల కానుంది. ఇప్పటి వ‌ర‌కు చిత్రానికి సంబంధించిన విడుద‌లైన పోస్ట‌ర్స్, గ్లింప్స్ సినిమాపై ఆస‌క్తిని పెంచాయి.

Sarkaaru Noukari OTT know the platform and streaming details
Sarkaaru Noukari OTT

థియేట్రిలక్ రిలీజ్‌కు ముందుగానే సర్కారు నౌకరి సినిమా ఓటీటీ పార్టనర్ ఫిక్స్ అయిన‌ట్టు తెలుస్తుంది.. సర్కారు నౌకరి సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ టీవీ ఛానెల్ ఈటీవీ నెట్‌వర్క్‌కు చెందిన “ఈటీవీ విన్” ఓటీటీ సంస్థ కొనుగోలు చేసింది. సింగర్ సునీతకు ఈటీవీతో ఉన్న ప్రత్యేక బంధంతోనే ఈ సినిమా హక్కులను వాళ్లు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదల అయి పాజిటివ్ టాక్ వచ్చి హిట్టు దిశగా దూసుకెళితే మూవీ 45 రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. లేదంటే మాత్రం నెల రోజులు కూడా కాకముందే అంటే జనవరి లాస్ట్ వీక్ లోనే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోనే వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now