దేవుడికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే అది దేనికి సంకేతం ? అప్పుడు ఏం చేయాలి ?

January 15, 2022 11:52 AM

హిందూ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఇంట్లో ఏదైనా పూజా కార్యక్రమాలు లేదా శుభ కార్యాలు జరిగినప్పుడు లేదా పండుగలు వంటి ప్రత్యేకమైన రోజులలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి కొబ్బరికాయ కొట్టడం ఆచారంగా వస్తోంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో లేదా ఆలయంలో తరచూ కొబ్బరికాయలను కొడుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మనం దేవుడికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. ఈ విధంగా కొబ్బరికాయ కుళ్ళిపోతే మనం ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తాము. అసలు కొబ్బరికాయ కుళ్ళిపోవడం దేనికి సంకేతం.. అని ఎన్నో అనుమానాలను మనసులో పెట్టుకుంటాము. మరి కొబ్బరికాయ కుళ్ళిపోతే దేనికి సంకేతం ? ఇలా కుళ్ళిపోవడం మంచిదేనా.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా దేవుడికి కొట్టే టెంకాయలు కుళ్ళిపోతే ఏ విధమైనటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. కొబ్బరికాయ కుళ్ళిపోవడం వల్ల మనకు జరిగే ప్రమాదం ఆ కొబ్బరి కాయ ద్వారా నాశనమైందని భావించాలని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా కొబ్బరికాయ చెడిపోతే మరోసారి మన కాళ్లు, చేతులను శుభ్రంగా కడుక్కుని ఆ స్థానంలో మరొక కొబ్బరికాయ కొట్టాలి.

అదేవిధంగా మనం ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాహనానికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే మరోసారి వాహనం శుభ్రం చేసి దాని స్థానంలో మరొక కొబ్బరికాయ కొట్టడం వల్ల ఆ దోషం తొలగిపోతుంది. అంతే కానీ కొబ్బరికాయ చెడిపోవడం వల్ల అనర్ధాలు జరుగుతాయని ఆందోళన చెందాల్సిన పనిలేదని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now