Srikanth : రాశితో కాకుండా ఆ హీరోయిన్స్‌తో శ్రీకాంత్‌కి ఎఫైర్ ఉందా.. ఎట్ట‌కేల‌కి స్పందించాడుగా..!

December 28, 2023 6:18 PM

Srikanth : హీరో శ్రీకాంత్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎన్నో వైవిధ్య‌మైన సినిమాల‌తో ప‌ల‌క‌రించాడు. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో న‌టిస్తూ తెగ సంద‌డి చేస్తున్నాడు. అయితే తాజాగా తమ్మారెడ్డి భరద్వాజాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీకాంత్ త‌న‌పై జ‌రుగుతున్న త‌ప్పుడు ప్ర‌చారాల‌పై స్పందించాడు. త‌మ్మారెడ్డి.. శ్రీకాంత్ ని సినిమా హీరోలంటే హీరోయిన్లతో ఎఫైర్లు ఉంటాయని అంటారు కదా. పెళ్లికి ముందు నీకు ఎంతమందితో ఎఫైర్ ఉంది అని అడ‌గ‌డంతో త‌న‌కు ఎంత మందితో ఎఫైర్స్ ఉన్నాయనేది మీకు తెలుసు. మీ దృష్టికి వ‌చ్చిన‌ప్పుడు అడ‌గండి. బ‌య‌ట రాసింది అడ‌గ‌డం కాదు అని శ్రీకాంత్ అన్నారు.

నువ్వు మంచోడివే అని నాకు తెలుసు కాని బ‌య‌ట ఏదో అనుకుంటున్నారు అని త‌మ్మారెడ్డి అన‌గా, బ‌య‌ట వాళ్లు ఏదో అనుకుంటే నేను ప‌ట్టించుకోను. అప్పుడు రాశి నేను ఏదో ఫంక్ష‌న్‌కి వెళితే ఏదేదో అన్నారు అని శ్రీకాంత్ అన్నాడు. దానికి త‌మ్మారెడ్డి.. “అవునూ.. నిన్ను పిచ్చకొట్టుడు కొడుతుంది ఏంటీ” అని నవ్వుతూ అడిగారు.దానికి స‌మాధానంగా మేం ఇద్దరం ఓ ఫంక్షన్‌కు వెళ్లాం. చాలా ఏళ్ల తర్వాత కలిశాం. అక్కడికి వచ్చిన ఈ హీరోయిన్‌ రాశీని చూసి రాశి అమ్మా అని అన‌డంతో నాకు న‌వ్వు వచ్చింది. అప్పుడే అమ్మ‌ని చేశారా అని నేను కూడా రాశి అమ్మ అని అన్నాను. దాంతో స‌ర‌ద‌గా కొట్టింది.

Srikanth told interesting facts about raashi
Srikanth

అంత‌కు మించి మా ఇద్ద‌రి మ‌ధ్య ఏం లేదు. ఎన్నో ఏళ్లుగా క‌ష్ట‌ప‌డి ప‌ని చేశాను. నాకు ఎఫైర్స్‌పై అంత ఆస‌క్తి లేదు అని శ్రీకాంత్ అన్నారు. ఇక నేను నటించిన వాళ్లలో సౌందర్య, రాశీతో అలా చాలామందితో కంఫర్ట్‌గా ఉండేది. నా కోస్టార్స్ మా ఇంటికి స‌ర‌దాగా వ‌చ్చేవారు. మంచి ఫ్యామిలీ రిలేష‌న్ ఉండేది. ఇక ఊహాకి నాకు విడాకులు అయ్యాయంటూ ఎన్నో ప్ర‌చారాలు సాగాయి. మేం అరుణాచలం వెళ్తుంటే మా విడాకుల వార్త చూసి షాక్ అయ్యాం. తర్వాత ఆ వార్తలను ఖండించాం అని శ్రీకాంత్ స్ప‌ష్టం చేశాడు. ఇక శ్రీకాంత్ త‌నయుడు కూడా హీరోగా స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now