12th Fail OTT Release : 12th ఫెయిల్ చిత్రం నేటి నుండి ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎందులో అంటే..!

December 28, 2023 12:57 PM

12th Fail OTT Release : ప్ర‌తి వారం కూడా థియేట‌ర్‌తో పాటు ఓటీటీలో వైవిధ్య‌మైన చిత్రాలు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇందులో ఒక‌టో రెండో చెప్పుకోద‌గ్గ‌వి, క‌ల‌కాలం నిలిచిపోయేవి, ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌క చూడాల్సినవి అరుదుగా ఉంటుంటాయి. వాటిలో 12th ఫెయిల్ చిత్రం ఒక‌టి. బయోగ్రాఫికల్ డ్రామా జాన‌ర్‌లో వ‌చ్చిన ఈ హిందీ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆక్టోబ‌ర్ 27న, తెలుగులో న‌వంబ‌ర్ 3న విడుద‌ల‌వ‌గా రెండు నెల‌ల త‌ర్వాత‌ ఇప్పుడు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ద‌మైంది. విధు వినోద్ చోప్రా దర్శక నిర్మాతగా వ్యవహరించిన సినిమా లో విక్రాంత్ మాస్సే .. మేధా శంకర్.. అనంత్ వి జోషి.. అన్షు మాన్ పుష్కర్.. ప్రియాంశు ఛటర్జీ ప్రధానమైన పాత్రలను పోషించారు.

1942 ల‌వ్ స్టోరీ, ప‌రిందా వంటి చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం, మున్నాబాయ్ ఎంబీబీఎస్‌, పీకే, 3 ఇడియ‌ట్స్‌ వంటి జాతీయ ఉత్త‌మ చిత్రాల‌ను నిర్మించిన విదు వినోద్ చోప్రా చాలాకాలం త‌ర్వాత మెగా ఫోన్ చేత‌బ‌ట్టి ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని నిర్మించ‌డ‌మే కాకుండా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మనోజ్ కుమార్ శర్మ ఐపీఎస్, శ్రద్ధా జోషి శర్మ ఐఆర్ఎస్ లు త‌మ‌ తీవ్రమైన పేదరికాన్ని అధిగమించి, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ చంబల్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి యూపీఎస్‌సీ ప్రిపరేషన్ కోసం ఢిల్లీకి వ‌చ్చి అక్క‌డ క‌ఠిన పరిస్థితులు ఎదుర్కొని ఏ విధంగా ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్లుగా అయ్యారు అనే నిప‌థ్యంలో చిత్రాన్ని రూపొందించారు. నిజ జీవిత ఘ‌ట‌న‌ల ఆధారంగా అనురాగ్ పాఠక్ అనే ర‌చ‌యిత రాసిన పుస్తకాన్ని ప్రేర‌ణ‌గా తీసుకుని నిర్మించిన‌ట్టు తెలుస్తుంది.

12th Fail OTT Release know the platform and streaming details
12th Fail OTT Release

మంచి హిట్ అందుకున్న ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ నెల 29వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.. ఈ తరం పిల్లలకు స్ఫూర్తిని .. ప్రేరణను కలిగించే సినిమా కావ‌డంతో మంచి హిట్ అయింది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా దాదాపు రూ.65 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి ఇప్ప‌టికీ థియేట‌ర్ల‌లో ర‌న్ అవుతుంది. థియేట‌ర్ల‌లో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు ఓటీటీలో మాత్రం అస‌లు మిస్స‌వ‌కండి. ముఖ్యంగా మీ పిల్ల‌ల‌తో క‌లిసి చూడ‌డం అస‌లు మ‌రువ‌ద్దు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now