Guppedantha Manasu December 27th Episode : శైలేంద్ర‌కు వార్నింగ్ ఇచ్చిన తండ్రి.. భయపడుతున్న దేవయాని..!

December 27, 2023 12:43 PM

Guppedantha Manasu December 27th Episode : వసుధారతో పాటుగా రిషి ని చంపడానికి, భద్ర అనే రౌడీతో డీల్ కుదుర్చుకుంటాడు. శైలేంద్ర కి నమ్మకస్తుడిగా మారిపోయి, తర్వాత ప్లాన్ ని అమలు చేస్తానని, శైలేంద్ర తో భద్ర అంటాడు. రిషి కనిపించకపోవడంతో, వసుధారా మహేంద్ర తన కొడుకు శైలేంద్ర ని అనుమానించడం ఫణీంద్ర తట్టుకోలేకపోతుంటాడు. రిషి ని వెతకమని చెప్తాడు. శైలేంద్ర ని తీసుకుని, వసుధార మహేంద్ర ఇంటికి ఫణింద్ర వస్తాడు. వద్దు అంటున్నా తండ్రి తనని మహేంద్ర ఇంటికి తీసుకురావడంతో, శైలేంద్ర కంగారు పడిపోతాడు. త్వరలోనే అసలైన దోషిని పట్టుకుంటానని, ముకుల్ తనతో చెప్పాడని శైలేంద్ర ని చూస్తూ ఫణింద్ర తో చెప్తాడు.

మహేంద్ర, శైలేంద్ర కూడా రిషి ని వెతికే పనిలోనే ఉన్నాడని ఫణింద్ర చెప్తాడు. శైలేంద్ర ఏ రిషి ని కచ్చితంగా తీసుకురాగలడని, ఒకవేళ తీసుకురాకపోతే అతడు ఉండడు కదా అని శైలేంద్ర పై మహేంద్ర సెటైర్ వేస్తాడు. రిషి విషయంలో శైలేంద్ర ని అనుమానిస్తున్నావా అని మహేంద్రని అడుగుతాడు. ఫణీంద్ర నిజంగానే శైలేంద్ర తప్పు చేసాడని తెలిస్తే నేను వాడిని షూట్ చేసి చంపేస్తానని, మహేంద్ర తో అంటాడు. శైలేంద్ర తండ్రి మాటలు విని షాక్ అవుతాడు.

అప్పుడు జగతి ఇప్పుడు రిషి విషయంలో శైలేంద్ర పై అనుమానం రావడానికి కారణం ఏంటి..? ఎన్నిసార్లు అడిగినా మీరు చెప్పట్లేదని వసుధార మహేంద్ర తో అంటాడు. ఫణింద్ర మహేంద్ర మౌనంగా ఉండిపోతాడు. చట్ట ప్రకారం అసలైన దోషుల్ని పట్టుకోవాలని అనుకుంటున్నట్లు అనుపమ, వసుధారా అంటారు. ఇందాక ఇంటికి వచ్చామని, కానీ మీరు ఎవరు లేరు అని ఎక్కడికి వెళ్లారని మహేంద్ర ని అడుగుతాడు. ఫణీంద్ర డెడ్ బాడీ ఐడెంటిఫై కోసం హాస్పిటల్ కి వెళ్లినట్లు చెప్పడు. మహేంద్ర శైలేంద్ర విషయాన్ని బయట పెట్టాలని చూస్తాడు. కానీ, అనుపమ జోక్యం చేసుకుని టాపిక్ ని మార్చేస్తుంది.

Guppedantha Manasu December 27th Episode today
Guppedantha Manasu December 27th Episode

దేవయాని కంగారు పడిపోతూ ఉంటుంది. తన కొడుకు ఎక్కడ దొరికిపోతాడని భయపడుతుంది. శైలేంద్ర తల్లికి ధైర్యం చెప్తాడు. భయం అన్నది తన హిస్టరీలోనే లేదని అంటాడు. వసుధారా ఇచ్చిన వార్నింగ్ ని శైలేంద్ర కి గుర్తు చేస్తుంది దేవయాని. అసలు ఉన్నాడో లేడో తెలియని రిషి ని, ఎక్కడినుండి తీసుకొస్తాను అని కొడుకుని అడుగుతుంది. శైలేంద్ర నిజ స్వరూపం తెలిస్తే, ఫణింద్ర ఉగ్రరూపం చూడాల్సి వస్తుందని కొడుకుని భయపడుతుంది దేవయాని.

అంతవరకు రానివ్వనని, కూల్ గా తల్లికి చెప్తాడు శైలేంద్ర. తన ప్లాన్ ఏంటో చెప్పమని, చూస్తూ ఉండమని దేవయానికి చెప్తాడు శైలేంద్ర. నువ్వు కోరుకున్నట్లే నీ కొడుకు రాజు అవుతాడని అంటాడు. శైలేంద్ర ప్లాన్ ఏంటో తెలియక దేవయాని కంగారు పడుతుంది. మహేంద్ర కారు డ్రైవర్ గా ప్లాన్ ప్రకారం భద్ర చేరతాడు. నువ్వు మాతో పాటు మా ఇంట్లోనే ఉండాలని భద్రతో మహేంద్రా అంటాడు. భద్ర యాక్టింగ్ ని చాటు నుండి చూస్తాడు శైలేంద్ర.

అతను కచ్చితంగా వసుధార రిషి ని చంపగలడని నమ్ముతాడు. శైలేంద్ర నిజ స్వరూపాన్ని బయటపెట్టాలని, ఆవేశంగా అనుపమతో అంటుంది. వసుధార భద్ర ని మహేంద్ర ఇంటికి తీసుకువస్తాడు. వసుధార ని కాపాడే బాధ్యత నీదేనని భద్ర తో మహేంద్ర అంటాడు. శైలేంద్ర కి ఫోన్ చేసిన భద్ర పనిలో చేరాను. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తానని అంటాడు. అప్పుడే మహేంద్ర వచ్చి ఆ మాటలు వింటాడు. ఎవరితో మాట్లాడుతున్నావ్ అని అడుగుతాడు. స్నేహితుడితో మాట్లాడుతున్నాను అని అంటాడు. రివర్స్ గేమ్ ఆడి డ్రామా స్టార్ట్ చేస్తాడు భద్ర. భద్ర కి తమ ఇంట్లోనే షెల్టర్ కూడా ఇవ్వాలని అనుపమ మహేంద్ర అనుకుంటారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now