Ala Ninnu Cheri OTT Streaming : హెబ్బా ప‌టేల్ లేటెస్ట్ చిత్రం ఓటీటీలోకి వ‌చ్చేసిందిగా.. ఎందులో అంటే..!

December 24, 2023 1:54 PM

Ala Ninnu Cheri OTT Streaming : పల్లెటూరి నేపథ్యం ఉన్న కథలకు ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంటుంది.ఈ కోవ‌లోనే రీసెంట్‌గా వ‌చ్చిన చిత్రం అలా నిన్ను చేరి. కొత్త దర్శకుడు మారేష్ శివన్ తెర‌కెక్కించిన చిత్రంలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించారు .ఈ సినిమా నవంబర్ 10న థియేటర్లలలో విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అంతగా రెస్పాన్స్ రాలేదు. థియేటర్లలోకి అలా వచ్చి వెళ్లింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.ఎలాంటి హడావిడి లేకుండా ఈ సినిమా సైలెంట్‏గా ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకొచ్చారు.

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొమ్మాలపాటి సాయి సుధాకర్ ఈ సినిమాను నిర్మించగా.. సుభాష్ ఆనంద్ సంగీతం అందించారు. ఈసినిమాలో కేదార్ శంకర్, అనశ్వి రెడ్డి, శివ కుమార్, చమక్మక్ చంద్ర, ఝాన్సీ, మహేశ్ ఆచంట కీలకపాత్రలు పోషించారు. మ‌రి థియేటర్స్‌లో పెద్ద‌గా అల‌రించ‌ని ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ఎంత అల‌రిస్తుందా అని ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్రంలో మిడిల్ క్లాస్ అబ్బాయిగా, లక్ష్యం కోసం పోరాడే యువకుడిగా, ప్రేమించిన అమ్మాయిని మరిచిపోలేని ప్రేమికుడిగా దినేష్ తేజ్ మెప్పించారు. ఇక ఫస్ట్ హాఫ్ లో పాయల్ రాధాకృష్ణ తన అందాలతో, పల్లెటూరి అమ్మాయిలా ఆకట్టుకుంటే, సెకండ్ హాఫ్ హెబ్బా పటేల్ మరింత అందాలు ఒలికిస్తూనే హీరోని మోటివేట్ చేసే పాత్రలో కనిపించారు.

Ala Ninnu Cheri OTT Streaming know the platform details
Ala Ninnu Cheri OTT Streaming

ఇక క‌థ విష‌యానికి వ‌స్తే.. ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయ దివ్య (పాయల్).. సాధారణ కుటుంబానికి చెందిన గణేశ్ (దినేశ్ తేజ్) ప్రేమలో పడుతుంది. కానీ దివ్యకు వేరే వ్యక్తితో పెళ్లి నిర్ణయిస్తుంది ఆమె తల్లి. దీంతో తనను ఎక్కిడకైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలని గణేశ్ పై ఒత్తిడి తీసుకువస్తుంది. సినీ డైరెక్టర్ కావాలని ఎన్నో కళలు కంటున్న గణేశ్..దివ్యతో పెళ్లి గురించి ఆలోచనలో పడతాడు. ఈ క్రమంలోనే అను (హెబ్బా పటేల్) అతడికి పరిచయం అవుతుంది. అను రాకతో గణేశ్, దివ్య ప్రేమకథలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? అనేది సినిమా. ప్రేమకథగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now