Animal Movie Total Collections : యానిమ‌ల్ చిత్రానికి ఎంత బ‌డ్జెట్ కేటాయించారు.. లాభాలు ఎంత వ‌చ్చాయి..!

December 21, 2023 3:10 PM

Animal Movie Total Collections : ఇటీవ‌లి కాలంలో దేశ వ్యాప్తంగా మంచి విజ‌యం సాధించిన చిత్రం యానిమ‌ల్. కొన్నాళ్లుగా బాలీవుడ్‌లో స‌రైన విజ‌యాలు ద‌క్క‌లేదు. ఇప్పుడిప్పుడే భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి. అందులో యాక్షన్ ఎంటర్‌టైనర్లుగా వచ్చే సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. అలా వచ్చి సెన్సేషన్ అయిన చిత్రాల్లో ‘యానిమల్ చిత్రం ఒక‌టి కాగా, ఈ మూవీకి టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం విశేషం. ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు. దీనికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా.. అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ కీలక పాత్రలను పోషించారు.

ఇక యానిమ‌ల్ చిత్రాన్ని దాదాపు రూ.200 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మించిన‌ట్టు స‌మాచారం. ఇక ఈ సినిమా నాన్ థియేటర్ రైట్స్ రూ.140 కోట్లు వ‌చ్చేశాయి. రూ.60 కోట్లు వ‌స్తే సేఫ్ జోన్‌లో ప‌డ్డ‌ట్టే. అయితే ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రానికి 350 కోట్లు షేర్ వచ్చింది. ఫుల్ రన్ లో 400 కోట్లు షేర్ ఎక్సపెక్ట్ చేస్తుండ‌గా, 60 కోట్లు థియేటర్ నుంచి వస్తే రికవరీ అయ్యినట్లే అని అంటున్నారు. యానిమ‌ల్ చిత్రం ఎలాగు 400 కోట్ల షేర్ తేవ‌డం ఖాయంగా క‌నిపిస్తుండ‌గా, పబ్లిసిటీ ఖర్చులు, వడ్డీలు, కమీషన్స్, మిగతా ఖర్చులు అన్నీ 40 కోట్లు అనుకుంటే ఆ మొత్తం పోను 300 కోట్లు నిర్మాతలకు మిగులుతుంది. అంటే నిర్మాతలకు 300 కోట్లు ఈ చిత్రం లాభం తెచ్చి పెట్టిందన్నమాట.

Animal Movie Total Collections how much it earned
Animal Movie Total Collections

యానిమ‌ల్ చిత్రానికి సీక్వెల్ కూడా ఉండ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. రెండవ భాగానికి యానిమల్ పార్క్ టైటిల్ నిర్ణయించినట్లు సందీప్ ఓ సంద‌ర్భంలో అన్నారు. ఎందుకంటే ఒకట్రెండు కాదు.. కొన్ని జంతువుల సమూహం సీక్వెల్ లో ఉంటుందన్నారు. పోస్ట్ క్రెడిట్ సీన్ ప్రకారం రణ్‌బీర్ ఈ సీక్వెల్ లో డబుల్ రోల్ లో కనిపించనట్లు తెలుస్తుంది. ఇక జోయాపాత్రలో నటించిన త్రిప్తి డిమ్రికి సీక్వెల్‌లో కాస్త ఎక్కువ నిడివి ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now