Evarevaro Video Song : యానిమ‌ల్ నుండి విడుద‌లైన ఎవ‌రెవ‌రో వీడియో సాంగ్.. బోల్డ్ సీన్స్ ఉన్నాయిగా..!

December 20, 2023 9:58 PM

Evarevaro Video Song : చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లో సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ యానిమల్. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కింది. చిత్రంలోని డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌తో పాటు బోల్డ్‌నెస్ యూత్‌ని ఎంత‌గానో ఆక‌ర్షించింది. ఇక సినిమాలోని సాంగ్స్, బీజీఎమ్, బీట్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రేక్షకులు రింగ్ టోన్స్, డయలర్ టోన్స్ సైతం పెట్టేసుకుంటున్నారు. తాజాగా ‘యానిమల్’ సినిమాలోని రణ్‌బీర్ కపూర్, తృప్తి డిమ్రిల హాట్ హాట్ సాంగ్‌ని మేకర్స్ ఫుల్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతూ.. టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

రణ్‍బీర్, తృప్తి మధ్య కెమెస్ట్రీ అదిరిపోవడంతో ఎవరెవరో వీడియో సాంగ్ ఎప్పుడెప్పుడు విడుద‌ల చేస్తారా అని ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసారు. ఎట్ట‌కేల‌కి ఫుల్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు. హిందీ, తమిళం, కన్నడ మలయాళం భాషల్లోనూ రిలీజ్ అయింది. ఈ పాట‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. అలానే వీడియో కూడా సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంది.ఎవరెవరో అనే ఈ పాటలో ఏమో ఏం చేస్తున్నానో.. ఇంకా ఏమేం చేస్తానో అంటూ వచ్చే లిరిక్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ పాటకు విశాల్ మిశ్రా సంగీతం అందించడంతోపాటు ఆలపించారు.

Evarevaro Video Song launched viral on youtube
Evarevaro Video Song

యానిమల్‌ చిత్రంలోని ఎవరెవరో పాటకు హిందీలో రాజ్ శేఖర్ లిరిక్స్ రాయగా.. తెలుగులో అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ఇక ఈ చిత్రం 18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.830కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఇప్పుడిప్పుడే ఈ చిత్రానికి కలెక్షన్లు నెమ్మ‌దిస్తుండ‌గా, మూవీ వెయ్యి కోట్లు రాబ‌ట్టం క‌ష్టంగా మారింది. త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం కూడా చేస్తున్నారు ఇక ఈ చిత్రంలో మితిమీరిన హింస, బోల్డ్ సీన్స్ ఉన్నాయంటూ విమర్శ‌లు రావ‌డంతో మూవీకి మంచి ప్ర‌మోష‌న్ ద‌క్కింది. ర‌ష్మిక ఇందులో క‌థానాయిక‌గా న‌టించ‌గా బాబీ డియోల్, అనిల్ కపూర్, శక్తి కపూర్, బబ్లూ పృథ్విరాజ్ కీలకపాత్రలు పోషించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now