Cabbage Water : క్యాబేజీ నీళ్ల గురించి ఈ విష‌యాలు తెలుసా.. వెంట‌నే వాటిని తాగ‌డం ప్రారంభిస్తారు..!

December 19, 2023 11:31 AM

Cabbage Water : క్యాబేజీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. క్యాబేజీని, మనం రెగ్యులర్ గా తీసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి. సాధారణంగా, చాలామంది క్యాబేజీని తినడానికి ఇష్టపడరు. క్యాబేజీ వాసన వస్తుందని, తినడానికి ఇష్టం లేదని, దూరం పెడుతూ ఉంటారు. కానీ, నిజానికి క్యాబేజీ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్యాబేజీ తినడం ఇష్టం లేని వాళ్ళు, క్యాబేజీని నీటిలో ఉడకబెట్టుకొని, ఆ నీటిని వడకట్టేసుకుని తాగవచ్చు. ఇలా చేయడం వలన, అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. ఈ నీళ్లు తాగితే, కంటి చూపు మెరుగు పడుతుంది. క్యాబేజీలో పాలీ ఫినాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.

క్యాబేజీ నీటిలో ఇండోల్-3 కార్బోనేట్ అని పిలవబడే, యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది లివర్ ఆరోగ్యానికి, ఎంతగానో ఉపయోగపడుతుంది. లివర్ సమస్యల్ని దూరంగా ఉంచుతుంది. క్యాబేజీ వాటర్ తాగడం వలన, బరువు తగ్గడానికి కూడా అవుతుంది. క్యాబేజీ నీటిని తాగితే, రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. ఇన్ఫెక్షన్లు రాకుండా, శరీరం ని మనం కాపాడుకోవచ్చు.

Cabbage Water many wonderful health benefits
Cabbage Water

ఈ క్యాబేజీ నీళ్లు తాగితే, కంటికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తగ్గిపోతాయి. చర్మం కూడా మృదువుగా మారుతుంది. కాంతివంతంగా తయారవుతుంది. క్యాబేజీలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంతో పాటుగా ఎముకలకు అవసరమైన బలం కూడా అందుతుంది. రక్తహీనత సమస్య కూడా, క్యాబేజీ నీళ్లు తాగడం వలన తగ్గుతుంది. రక్తహీనత సమస్య కి దూరంగా ఉండడమే కాకుండా, రక్త సరఫరా కూడా మెరుగు పడుతుంది.

శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు. చర్మం మృదువుగా మారుతుంది. కాంతివంతంగా తయారవుతుంది. చాలామంది, అందంగా ఉండడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ వుంటారు. మచ్చలు వంటివి కూడా క్యాబేజీ వాటర్ తాగడం వలన, తొలగిపోతాయి. అలానే, అల్సర్ తో బాధపడే వాళ్ళు, ఈ క్యాబేజీ నీళ్లు తాగితే జీర్ణాశయంలో, పేగుల్లో పుండ్లు ఏర్పడకుండా నివారిస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా ఉండవు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now