ఆహాలో నయనతార ‘ నీడ ‘.. ఎప్పుడంటే ?

July 21, 2021 7:29 PM

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓటీటీలకు మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఓటీటీలో విడుదలవుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఎక్కువగా మలయాళ సినిమాలు ఓటీటీలో విడుదల అవుతూ రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే నయనతార ప్రధాన పాత్రలో నటించిన “నిళల్‌”సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి “నీడ” అనే టైటిల్ తో ఆహా వేదికగా విడుదల చేయాలని భావించారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఆహా విడుదల చేసింది. ఇందులో ఓ చిన్న పిల్లాడు చెప్పే మాటలు, మర్డర్ అన్నీ కూడా నిజంగానే జరుగుతాయి. దీంతో ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఈ విధంగా ఆ పిల్లాడు చెప్పిన ప్రదేశాలకు వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే అస్థిపంజరాలు బయటపడతాయి.ఈ విధంగా ఈ సినిమాపై అంచనాలను రేకెత్తించే విధంగా ట్రైలర్ ఉండడంతో ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ మర్డర్ వెనుక ఉన్న కథ ఏమిటి? వీటిని హీరో, హీరోయిన్ నయనతార ఎలా చేదించారు అనే విషయం తెలియాలంటే జూలై 23 వరకు వేచి ఉండాలి. ఈ సినిమా జులై 23 నుంచి ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం నీడ ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now