SS Rajamouli : ఏంటి.. రాజ‌మౌళి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆ మూవీలో న‌టించారా..!

December 18, 2023 10:07 AM

SS Rajamouli : టాలీవుడ్‌లోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగాను ఎంతో క్రేజ్ అందుకున్న ద‌ర్శ‌కుల‌లో రాజ‌మౌళి ఒక‌రు. తెలుగు సినిమా మేకింగ్ స్టైల్ మార్చిన ఇత‌ను తెరపై అన్ని రసాలను సమపాళ్లలో రంగరించి చూపించాడు. మాస్, యాక్షన్, కామెడీ రొమాన్స్ ఇలా ఏ జాన‌ర్ అయిన స‌రే ప్రేక్ష‌కుల‌ని ర‌క్తి క‌ట్టిస్తాడు. మన దేశానికి తొలి ఆస్కార్ తీసుకొచ్చిన దర్శక బాహుబలి రాజ‌మౌళి ద‌ర్శ‌కుడిగానే కాకుండా చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా స‌త్తా చాటాడ‌ట‌. ఈ సినిమా కొన్ని కారణాలవల్ల రిలీజ్ కాలేదు మరి ఈయన నటించినటువంటి ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ నిర్మాణంలో తన బాబాయ్ శివశక్తి దత్త దర్శకత్వంలో తెరకెక్కినటువంటి చిత్రం పిల్లన గ్రోవి.

ప‌ది సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో రాజ‌మౌళి పిల్ల‌న గ్రోవి సినిమాలో నటించారట అంతే కాకుండా ఈ సినిమాలో తన సోదరి శ్రీలేఖ కూడా నటించారు. ఇక ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చే సమయానికి ఫైనాన్షియల్ స‌మస్య రావ‌డంతో ఈ చిత్రం విడుద‌ల కాలేదు. దీంతో రాజ‌మౌళిని చైల్డ్ ఆర్టిస్ట్‌గా చూసే అవ‌కాశం లేకుండా పోయింది. ఈ చిత్రం విడుద‌లై మంచి హిట్ అయి, రాజ‌మౌళికి మంచి పేరు వ‌చ్చి ఉంటే ఆయ‌న ద‌ర్శ‌కుడిగా కాకుండా న‌టుడిగా ఉన్న‌త స్థానంలోకి వెళ్లేవారేమో అంటూ ప‌లువురు ముచ్చ‌టించుకుంటున్నారు.

SS Rajamouli acted as child artist in that movie
SS Rajamouli

సినీ 22 సంవత్సరాల సినీ ప్రస్థానంలో అపజయం ఎరగని దర్శకుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాజ‌మౌళి. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తొలి చిత్రం ‘స్టూడెంట్ నెం. 1’ సినిమాను తెరకెక్కించారు రాజ‌మౌళి. సి అశ్వనీదత్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం రాజ‌మౌళికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆ సినిమా నుండి రాజ‌మౌళి చేసిన అన్ని సినిమాలు కూడా సూప‌ర్ హిట్టే. స్టూడెంట్ నెం. 1 చిత్రం నుంచి ‘రౌద్రం రణం రుధిరం’ వరకు ప్రతి చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. ఇక ఎన్టీఆర్, రాజ‌మౌళి క‌లిసి మొదటి సారి స్టూడెంట్ నెం. 1కి పని చేశారు. ఆ తర్వాత సింహాద్రి, ఆపై యమదొంగ.. రౌద్రం రణం రుధిరం అనే సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now