Jabardasth sowmya Rao : జ‌బ‌ర్ద‌స్త్‌ను ఎందుకు విడిచిపెట్టిందో అస‌లు విష‌యం చెప్పేసిన సౌమ్యా రావు.. అంద‌రూ షాక‌య్యారుగా..!

December 15, 2023 7:55 PM

Jabardasth sowmya Rao : ఒక‌ప్పుడు బుల్లితెర కామెడీ షోకి అనసూయ‌, ర‌ష్మీలు ప‌ర్మినెంట్ యాంక‌ర్స్‌గా ఉండే వారు. ఎప్పుడైతే అన‌సూయ త‌ప్పుకుందో అప్ప‌టి నుండి ఆమె స్థానంలో కొత్త వాళ్లు వ‌చ్చిపోతున్నారు. అనసూయ వెళ్ళిపోయిన తర్వాత ప్రముఖ సీరియల్ యాక్టర్ సౌమ్యరావును యాంకర్ గా తీసుకొచ్చారు మల్లెమాల యూనిట్.తెలుగులో జబర్దస్త్ ను అద్భుతంగానే నడిపించింది. త‌న‌పై పంచ్‌లు వేసిన‌, ఎలాంటి కామెంట్స్ చేసిన అన్నింటిని స్వీక‌రించి అంద‌రితో స‌ర‌దాగా ఉండేది. అయితే ఉన్నఫలంగా సౌమ్యరావు ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవ‌డం అంద‌రిలో అనేక అనుమానాలు తెప్పించాయి.

అయితే సౌమ్య‌రావు ఈ కార్యక్రమం నుంచి త‌ప్పుకున్న‌ప్ప‌టి నుండి ఈ భామ తప్పుకోవడానికి కారణం ఏంటి అనే విషయాలపై చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు.తనంతట తానే ఈ కార్యక్రమం నుంచి తప్పకుందా లేక ఆమె వెళ్లిపోవడానికి ఎవరైనా కారణమా? ఏదైనా జరిగిందా? అన్న సందేహాలు అందరికీ వ్యక్తం అయ్యాయి. ప్రస్తుతం సౌమ్య స్థానంలో బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సిరి హనుమంతు యాంకర్ గా వ‌చ్చి చేరింది. సిరి కూడా షోని బాగానే న‌డిపిస్తున్న‌ప్ప‌టికీ ఆమె ఎందుకు వెళ్లింది అనే దానిపై మాత్రం క్లారిటీ రాక‌పోవ‌డంతో అది తెలుసుకునే ప్ర‌యత్నం చేస్తున్నారు.

Jabardasth Sowmya Rao this is the reason why she left that show
Jabardasth Sowmya Rao

తాజాగా అభిమానులతో చిట్ చాట్ సెషన్ నిర్వహించిన సౌమ్యరావుకి ఒక నెటిజన్ నుంచి జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడం వెనుక అసలు కారణం ఏంటి? అన్న ప్రశ్న ఎదురయింది..ఇక దానికి సమాధానం ఇస్తూ.. “సమయం వస్తుంది.. అప్పుడు అన్నీ చెబుతాను.. థాంక్యూ సో మచ్..” అంటూ అక్కడితో చ‌ర్చ ముగించింది. దీంతో సౌమ్యరావు జబర్దస్త్ షో కి దూరం అవ్వడం వెనుక ఏదో త‌తంగం జరిగింది అన్న అనుమానాలు ఇప్పుడు అంద‌రిలో తలెత్తుతున్నాయి.. మరి సౌమ్య ఈ విషయంపై ఎప్పుడు నోరు విప్పుతుందో ?ఆ సమయం ఎప్పుడు వస్తుందో? చూడాలి.కన్నడనాట బుల్లితెరపై సందడి చేసిన ఈ బ్యూటీ.. ప్ర‌స్తుతం ప‌లు తెలుగు సీరియ‌ల్స్‌లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now