Non Veg Foods : నెల రోజులు మాంసాహారం తీసుకోకుండా ఉంటే.. ఏం అవుతుంది…? ఇన్ని లాభాలా..?

December 16, 2023 12:51 PM

Non Veg Foods : చాలామంది, శాఖాహారం మాత్రమే తీసుకుంటున్నారు. శాఖాహారం తీసుకోవడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మాంసాహారాన్ని పూర్తిగా మానేసి, కేవలం శాఖాహారాన్ని మాత్రమే తీసుకునే వాళ్ళు కూడా, చాలామంది ఉన్నారు. ఆరోగ్యానికి మాంసాహారం మంచిది కాదని, చాలామంది చెప్తూ ఉంటారు. కానీ, చాలా మంది మాంసాహారాన్ని వదిలిపెట్టలేక మాంసాహారాన్ని తీసుకుంటూ ఉంటారు. మాంసాహారాన్ని పూర్తిగా మానేకపోయినా, పరిమితంగా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు.

మాంసాహారాన్ని మానేసి పూర్తిగా శాకాహారం తీసుకుంటే, ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది. రీసెర్చ్ కూడా ఈ విషయాలను వెల్లడించింది. అయితే, పూర్తిగా మాంసాహారాన్ని మానేకపోయినా, ఒక నెలపాటు మాంసాహారాన్ని పక్కన పెట్టేసినా, పూర్తి శాకాహారాన్ని తీసుకుంటే. చక్కటి ఫలితం ఉంటుంది. శాకాహారాన్ని మాత్రమే, ఒక నెలరోజుల పాటు తీసుకుంటే ఏమవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

what happens to your body if you stop eating Non Veg Foods for one month
Non Veg Foods

ఈ మధ్య చాలామంది, నాన్ వెజ్ తినకుండా శాకాహారులుగా మారిపోతున్నారు. అయితే, దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆరోగ్యాన్ని, అందాన్ని, ఫిట్నెస్ ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా, కేవలం శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. అయితే, మాంసాహారంలో లభించే పోషకాలు కొన్ని రకాల శాకాహార పదార్థాలలో మనకి ఈజీగా దొరుకుతాయి. ప్రోటీన్ కోసం ఎక్కువ మంది మాంసం తింటూ ఉంటారు.

కానీ కంది, సోయా, బీన్స్, చిక్కుడు వంటి వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మాంసాహారంతో పోల్చుకుంటే, శాకాహారం త్వరగా జీర్ణం అయిపోతుంది. గట్ హెల్త్ కి ఇది బాగా మేలు చేస్తుంది. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, షుగర్ వంటి సమస్యలు రాకుండా కూడా శాకాహారం చూసుకుంటుంది. మాంసాహారం తీసుకునే వాళ్ళల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. దాంతో రక్తపోటు గుండెపోటు వంటివి కలుగుతుంటాయి. అలానే, హృదయ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, పూర్తిగా శాకాహారం తీసుకుంటే ఎటువంటి బాధలు ఉండవు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now