Tripti Dimri : ఎన్టీఆర్‌తో న‌టించాల‌ని ఉందంటూ మ‌న‌సులోని కోరిక బ‌య‌ట‌పెట్టిన ‘యానిమ‌ల్’ భామ

December 14, 2023 3:42 PM

Tripti Dimri : ఇప్పుడు ఎక్క‌డ చూసిన యానిమ‌ల్ గురించే చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ర‌ణ్‌బీర్, ర‌ష్మిక‌తో పాటు మ‌రో భామ గురించి ఎక్కువ‌గా మాట్లాడుకుంటున్నారు. ఆమె మ‌రెవ‌రో కాదు త్రిప్తి దిమ్రి. యానిమ‌ల్ చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించిన ఆమె, తన అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాలో త్రిప్తి నటన, ఇంటిమేట్ సీన్స్ ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ర్షించాయి. ఈ మూవీతో హిందీలోనే కాక తెలుగులోను ఈ బామ‌కి ఫుల్ క్రేజ్ లభించింది. ప్రస్తుతం త్రిప్తికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన‌గా, ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి తన మనసులో మాట చెప్పేసింది.

త‌న‌కి సౌత్ ఇండ‌స్ట్రీ నుంచి ఆఫ‌ర్‌లు వ‌చ్చిన‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌పై ఓ ఇంట‌ర్వ్యూలో త్రిప్తి స్పందిస్తూ.. ”నేను ఇప్ప‌టివ‌ర‌కు ఏ సౌత్ సినిమాను ఒప్పుకోలేదు. కానీ సౌత్‌లోనూ అవకాశాలు రావాలని కోరుకుంటున్నా. ”నాకు జూనియర్‌ ఎన్టీఆర్ అంటే ఇష్టం ఆయ‌న‌తో కలిసి నటించాలని నా కోరిక అంటూ ఈ భామ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త్రిప్తి దిమ్రి చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక తండ్రీకొడుకుల సెంటిమెంట్​తో రూపొందిన ‘యానిమల్​’లో రణ్​బీర్​కు జంటగా అందాల తార రష్మిక మందన్నా నటించింది. అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్ర‌లు పోషించారు.

Tripti Dimri wants to act with jr ntr
Tripti Dimri

యానిమ‌ల్ చిత్రంలో ‘త్రిప్తి డిమ్రీ’ ‘జోయా’ అనే పాత్ర‌లో న‌టించి ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. తాజాగా ఐఎండీబీ విడుదల చేసిన మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్ల లిస్ట్‌లోను త్రిప్తి మొదటి స్థానంలో నిల‌వ‌డం విశేషం. ఇక ‘యానిమ‌ల్’ సినిమాతో ఇండియా వైడ్ పాపుల‌ర్ అయిన ఈ అమ్మడు కోసం ఇప్ప‌టికే సౌత్ ఇండ‌స్ట్రీకి సంబంధించి ప‌లువురు ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారనే టాక్ బాగా వినిపిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now