Broken God Idols : విరిగిపోయిన విగ్రహాలు ఇంట్లో ఉండకూడదా..? ఉంటే ఏం అవుతుంది..?

December 15, 2023 5:35 PM

Broken God Idols : చాలామంది, వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన, అంతా మంచే జరుగుతుంది. పండితులు చెప్పినట్లు చాలామంది ఆచరిస్తూ ఉంటారు. ఏమైనా తప్పులు చేస్తే, దాని యొక్క ఫలితం కారణంగా మనం చిక్కుల్లో పడతాము. అందుకని, పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. తెలిసి కానీ, తెలియక కానీ, అస్సలు తప్పులు చేయకూడదు. ఏమైనా తప్పు చేస్తే, దాని వలన మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇంట్లో కొన్ని పొరపాట్లను అసలు చేయకూడదని పండితులు చెప్పడం జరిగింది. మనం రోజు పూజ గదిలో దేవుళ్ళకి పూజలు చేస్తూ ఉంటాము.

శుభ్రంగా వాటిని ఎప్పటికప్పుడు ఉంచుకుంటుంటాము. అయితే, పూజగది విషయంలో ఈ పొరపాట్లు అసలు చేయకూడదు. చాలామంది, పూజ గది విషయంలో ఈ పొరపాట్లు చేస్తూ ఉంటారు. పూజ మందిరంలో విరిగిపోయిన దేవుడి విగ్రహాలని పూజించకూడదు. ఇటువంటి విగ్రహాలని పూజించడం వలన నెగటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంట్లో దేవుడి విగ్రహాలు ఎప్పుడూ కూడా సరిగ్గా ఉండాలి. విరిగిపోయిన వాటిని పూజించడం వలన, చెడు జరుగుతుందిట. విగ్రహాలకు బదులుగా దేవతామూర్తుల ఫోటోలని పూజించడం మంచిదని పండితులు చెప్పడం జరిగింది.

Broken God Idols can we keep them in home
Broken God Idols

ఒకవేళ విగ్రహాలని ప్రతిష్టించుకోవాలంటే, వాస్తు నిపుణులు చెప్పినట్లు చేయాలి. సరైన స్థానంలో దేవుని విగ్రహాలని ఉంచితేనే మంచి జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఏదైనా కారణం వలన, ఇంట్లోని దేవుడు విగ్రహం విరిగిపోయినట్లయితే, దానిని తొలగించి, కొత్త వాటిని పెట్టుకోవడం మంచిది. ఒకవేళ కనుక విగ్రహం చిన్నగా పగిలినా కూడా దానిని తొలగించడమే మంచిది. చాలామంది, విరిగిపోయిన విగ్రహాలని మళ్లీ అతికించి పూజిస్తూ ఉంటారు.

అలా చేయకూడదు అని పండితులు అంటున్నారు. ఈ పొరపాటు చేస్తే, వాస్తు దోషాలు బాధిస్తాయి. విరిగిన విగ్రహం ప్రతికూల శక్తుల్ని ఆకర్షిస్తుంది. ఈ కారణంగా, చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రావడం, మనశ్శాంతి లేకపోవడం వంటివి జరుగుతాయి. మన చేతి నుండి విగ్రహం చేజారి పోతే అది అశుభం. ఎప్పుడు కూడా ఈ తప్పులు జరగకుండా చూసుకోండి. లేదంటే, ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now