Ayushman Bharat Card : ఆయుష్మాన్ కార్డ్ కి అర్హులు ఎవరు..? ఉపయోగాలు తెలుసా..? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?

December 14, 2023 12:19 PM

Ayushman Bharat Card : కేంద్ర ప్రభుత్వం, చాలా స్కీములని తీసుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అందించే స్కీముల ద్వారా, చాలామంది బెనిఫిట్ పొందుతున్నారు. రైతుల కోసం ప్రత్యేకించి, కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అలానే, పేదల కోసం కూడా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలని ప్రవేశ పెట్టడం జరిగింది. అయితే కేంద్రం తీసుకువచ్చిన వాటిల్లో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలను ఈరోజు చూద్దాం. ఆయుష్మాన్ స్కీమ్ ద్వారా ఎన్నో ఉపయోగాలని పొందొచ్చు.

దీని కింద ఎంపిక చేసిన ఆసుపత్రిలో ఫ్రీగా చికిత్స పొందవచ్చు. ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న ప్రజలు, ఈ స్కీం ద్వారా ఉపశమనాన్ని పొందవచ్చు. పేదలకి ఆయుష్మాన్ భారత్ ఒక వరం అని చెప్పొచ్చు. ఈ పథకం ద్వారా, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళు ఐదు లక్షల వరకు చికిత్సని పొందడానికి అర్హులు. ఈ కార్డు కింద ఏ వ్యాధులకి చికిత్స పొందవచ్చు..? ఎటువంటి చికిత్సలు చేయించుకోవచ్చు అనేది కూడా చూద్దాం.

Ayushman Bharat Card how to apply in telugu who are eligible
Ayushman Bharat Card

కరోనా, క్యాన్సర్, కిడ్నీ, గుండె, డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, డయాలసిస్, మోకాలి, తుంటి మార్పిడి, కంటిశుక్లం అలానే ఇతర సమస్యల కి చికిత్స చేయించుకోవచ్చు. ఈ స్కీము ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవచ్చు. కచ్చా ఇళ్లలో ఉంటున్న ప్రజలు, భూమిలేని వాళ్ళు, షెడ్యూల్డ్ కులాలు, తెగకు చెందినవారు ఈ స్కీము కి అర్హులు. అలానే, గ్రామీణ ప్రాంతాల్లో వారు, ట్రాన్స్‌జెండర్లు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు కూడా అర్హులే.

ఇక ఎలా అప్లై చేసుకోవాలో చూస్తే.. అధికారిక వెబ్‌సైట్ mera.pmjay.gov.in కి లాగిన్ అవ్వాలి. మొబైల్ నంబర్, క్యాప్చా ఎంటర్‌ చేసేసి… మీ నంబర్‌కు వచ్చిన OTP ఇవ్వాలి. మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి. పేరు, మొబైల్ నంబర్, రేషన్ కార్డ్ వంటి వివరాలను ఇచ్చేయండి. కుడి వైపున ఉన్న కుటుంబ సభ్యులపై ట్యాబ్ చేసి, లబ్ధిదారులందరి పేర్లను కూడా యాడ్ చేయాలి. ఆ తరవాత మీకు కార్డు వస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now