ఈ సినిమాల్లోని ఎమోష‌న‌ల్ సీన్లు గుర్తున్నాయా.. ఇప్ప‌టికీ మ‌న‌ల్ని అవి కంట‌త‌డి పెట్టిస్తాయి..!

July 20, 2021 4:26 PM

స‌మాజంలోని పరిస్థితుల‌కు అనుగుణంగానే కాదు, ర‌క ర‌కాల క‌థాంశాల‌తో ద‌ర్శ‌క నిర్మాత‌లు సినిమాల‌ను తీస్తుంటారు. అయితే వాటిల్లో కొన్ని మాత్ర‌మే ఆక‌ట్టుకుంటాయి. కానీ సెంటిమెంట్ క‌థాంశంతో తీసే సినిమాలు ఎల్ల‌ప్పుడూ విజ‌యం సాధిస్తాయి. అలాంటి క‌థ‌ల‌తో వ‌చ్చిన ఎన్నో సినిమాలను ప్రేక్ష‌కులు ఆద‌రించారు. బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. అలాంటి కొన్ని మూవీలు ఎప్ప‌టికీ గోల్డెన్ హిట్స్‌గా నిలిచిపోతాయి. ఈ క్ర‌మంలోనే కొన్ని ఎమోష‌న‌ల్ మూవీల్లోని అద్భుత‌మైన స‌న్నివేశాల‌ను ఒక్క‌సారి చూద్దాం.

these movie scenes will make us tears

1. మాధవి, నాజ‌ర్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో అప్ప‌ట్లో వ‌చ్చిన ‘మాతృదేవోభ‌వ’ మూవీ అంద‌రినీ కంట త‌డి పెట్టించింది. అందులో అనేక ఎమోష‌నల్ సీన్లు ఉంటాయి. కానీ కింద ఇచ్చిన ఒక్క సీన్ మాత్రం మ‌రీ ఎమోష‌న‌ల్‌గా ఉంటుంది. ఒక్క‌సారి చూడండి.

https://youtu.be/BzHZ_JIw-LA

2. తెలుగు, త‌మిళ భాష‌ల్లో వ‌చ్చిన చియాన్ విక్ర‌మ్ సినిమా ‘నాన్న’ కూడా ఎమోష‌న‌ల్‌గా సాగుతుంది. అందులోని క్లైమాక్స్ సీన్ అంద‌రినీ కంట త‌డి పెట్టిస్తుంది.

3. అల్లు అర్జున్, అనుష్క‌, మంచు మ‌నోజ్ లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన ‘వేదం’ మూవీ కూడా ఎమోష‌నల్‌గా ఉంటుంది. అందులో అన్ని సీన్లు బాగుంటాయి. ముఖ్యంగా హాస్పిట‌ల్‌లో అల్లు అర్జున్ డ‌బ్బులు కొట్టేసే సీన్, త‌రువాత క్లైమాక్స్ సీన్‌లు అద్భుతంగా ఉంటాయి.

https://youtu.be/cYuasr7AEgA

4. సిద్ధార్థ్, త్రిష‌, శ్రీ‌హ‌రిలు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన ‘నువ్వొస్తానంటే నేనొద్దాంటానా’ మూవీలో త్రిష‌, శ్రీ‌హ‌రిల చిన్న‌త‌నం స‌న్నివేశాలు బాగుంటాయి.

5. మాధ‌వ‌న్, సిమ్రాన్ లు న‌టించిన ‘అమృత’ మూవీలోని సీన్లు కూడా కంట త‌డి పెట్టిస్తాయి.

6. ‘ప్రేమికుల రోజు’ మూవీలో నాస‌ర్ చిన్న‌త‌నం సీన్లు ఎమోష‌న‌ల్‌గా ఉంటాయి.

7. ‘ఛ‌త్ర‌ప‌తి’ మూవీలో కాట్‌రాజ్ అనే క్యారెక్ట‌ర్ ఓ బాలున్ని చంపిన‌ప్పుడు చూపించే సీన్ ఎమోష‌న‌ల్‌గా ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now