Beauty Tips : బ్యూటీ పార్లర్ కి వెళ్ళక్కర్లేదు.. ఇంట్లోనే ఇలా చేసి అందాన్ని రెట్టింపు చేసుకోండి..!

December 13, 2023 6:05 PM

Beauty Tips : అందంగా కనపడడం కోసం, చాలామంది రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. అందాన్ని పెంపొందించుకోవడానికి, మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్ ని కూడా, చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది, ఇంటి చిట్కాలు పాటిస్తూ ఉంటారు. చాలామంది, ఈ రోజుల్లో ముడతలు, మచ్చలు, మొటిమలు ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. అందంగా, కాంతివంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ వుంటారు. అందరికీ ఈ కోరిక ఉండడం సహజం. అయితే, చాలామంది అందాన్ని పెంపొందించుకోవడానికి వేలకు వేలు డబ్బులు కూడా ఖర్చు పెడుతూ ఉంటారు.

బ్యూటీ పార్లర్ ల చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు. ఇవేమీ కాకుండా, తక్కువ డబ్బులుతోనే మనం, సులభంగా నల్లని మచ్చలు, ముడతలు, మొటిమలు వంటివి తగ్గించుకోవచ్చు. ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. పెద్దగా కష్టపడక్కర్లేదు. ఓపిక ఉంటే చాలు. అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలగవు. కాంతివంతమైన చర్మాన్ని పొందాలని చూసేవాళ్ళు, ఈ పదార్థాలతో ఈజీగా అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.

follow these Beauty Tips for dark circles removal
Beauty Tips

దీనికోసం, రెండు స్పూన్లు బంగాళదుంపల రసం లో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ నిమ్మ రసం, ఒక స్పూన్ గ్లిజరిన్ వేసి, బాగా మిక్స్ చేయాలి. దీనంతటినీ ముఖానికి బాగా పట్టించి, పావుగంట పాటు వదిలేసి, తర్వాత గోరువెచ్చని నీటితో, ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే అదిరిపోయే ఫలితం ఉంటుంది. బంగాళదుంపలో పోషకాలు ఎక్కువ ఉంటాయి. చర్మ సమస్యలు తగ్గించడానికి కూడా బంగాళదుంప రసం హెల్ప్ చేస్తుంది.

డార్క్ సర్కిల్స్ వంటి సమస్యల నుండి కూడా ఈజీగా బయటపడొచ్చు. చర్మం పై మృత కణాలను తొలగించి, ముఖం కాంతివంతంగా మారేటట్టు చేస్తుంది. నిమ్మరసంలో ఉన్న పోషకాలు ముడతలు, ఫైన్ లైన్స్ ని తగ్గిస్తుంది. చర్మం పై ఉన్న ముడతలు ని తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి. కొబ్బరి నూనెలో యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అలానే యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు కూడా ఉంటాయి. చర్మానికి సహజ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now